Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మంత్రి సబితా ఇంద్రారెడ్డి
నవతెలంగాణ - మీర్పేట్
మీర్పేట్ మున్సిపల్ కార్పోరేషన్ ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేస్తున్నామని తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఆదివారం కార్పోరేషన్ పరిధిలో 12, 14, 29, 33, 34, 35 డివిజన్లలో రూ.2 కోట్ల 17లక్షల 60వేల నిధుల అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కార్పోరేషన్ అభివృద్ధి కోసం ప్రణాలిక బద్ధంగా ముందుకు వెళ్తున్నామని తెలిపారు. సంక్షేమ పథకాలు అమలు చేయడంలో దేశంలోనే తెలంగాణ ప్రభుత్వం ముందు ఉందని పేర్కొన్నారు. దళితుల అభివద్ధి కోసం దళిత బంధు పథకాన్ని రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో అమలుకు ఆదేశించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మేయర్ దుర్గా దీప్ లాల్ చౌవాన్, డిప్యూటీ మేయర్ తీగల విక్రమ్‌రెడ్డి, కమిషనర్ నాగేశ్వర్, డీఈ, ఏఈ, స్థానిక కార్పొరేటర్లు, ఇంద్రావత్ రవినాయక్, కరుణానిధి, నీల రవినాయక్, చెవ్వ మణెమ్మ, బీమ్ రాజ్, సౌందర్యవిజరు, ప్లోర్ లీడర్ భూపాల్‌రెడ్డి, టీఆర్ఎస్ అధ్యక్షుడు అర్కల కామేష్‌రెడ్డి, మున్సిపల్ అధికారులు, టీఆర్ఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.