Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-శంషాబాద్
మండల పరిధిలోని పెద్ద గోల్కొండ గ్రామంలో ఆదివారం తెల్లవారుజా మున దేశపాగా ఎల్లమ్మ అనే మహిళ మరణించారు. విషయం తెలుసుకున్న ఎంపీటీసీ గడ్డమీది యాదగిరి, ఉప సర్పంచ్ ఆనేగౌనీ స్వరూప గౌడ్‌తో పాటు వార్డు సభ్యులు నాయకులు కలసి అంత్యక్రియల నిమిత్తం వారి కుటుంబానికి 5వేల రూపాయల ఆర్థిక సహాయం చేశారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు బోయిని శ్రీశైలం ముదిరాజ్, ఎం. శ్రావణి పాండురగారెడ్డి, కే.సాయిలమ్మ, ఏ.మాణేమ్మగౌడ్, సిహెచ్ అమృత, టీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షులు అనేగౌని శ్రీకాంత్‌గౌడ్, బీసీ సెల్ ఉపాధ్యక్షులు కుమ్మరి రమేష్, గ్రామ యువకులు కే. బాబుకిరణ్, చంద్రం గుట్ట శ్రీనివాస్, దుర్గం రాఘవేందర్ యాదవ్, డీ.దేవదాస్, యాదయ్య, గడ్డమీది ఈశ్వరయ్య, బైకనీ రాఘవేందర్, పాల్వాయి సంతోష్ తదితరులు పాల్గొన్నారు.