Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రవీందర్
నవతెలంగాణ-మర్పల్లి
రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రవీందర్ అన్నారు, ఆదివారం మండల కేంద్రంలో పార్టీ సభ్యత్వ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మర్పల్లి మండలంలో కాంగ్రెస్ సభ్యత్వాన్ని అత్యధికంగా చేపట్టి వికారాబాద్ నియోజకవర్గంలో మొదటి స్థానంగా ఉంచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు గణేష్, వార్డ్ మెంబర్ సర్వేశ్, సుధీర్, యువజన కాంగ్రెస్ నాయకుడు రాఘవేందర్, బల్వంత్ రెడ్డి, శివ, తులసి దాస్, రాజేందర్‌గౌడ్, సుధాకర్ రెడ్డి, కిషోర్, తదితరులు పాల్గొన్నారు.