Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-శంకర్పల్లి
అర్బన్ డెవలప్మెంట్ కంపెనీ తాత దిలీప్ రాజు సహాయ, సహకారాలతో పొద్దుటూరు కింది బస్తీలో సీసీరోడ్డు పనులు చేపట్టినట్టు సర్పంచ్, సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు ఏనుగు నర్సింహారెడ్డి తెలిపారు. మండల పరిధిలోని పొద్దుటూరు గ్రామంలో దళితవాడలో రూ.40 లక్షలతో చేపట్టిన సీసీరోడ్డు పనులను ఆదివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పొద్దుటూరు గ్రామాన్ని జిల్లాలోని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడానికి శాయశక్తుల కృషి చేస్తానని తెలిపారు. అర్బన్ డెవలప్మెంట్ కంపెనీ దాత దిలీప్ రాజు ఎస్సీ కాలనీ రోడ్లకు నిధులు మంజూరు చేయడం పట్ల ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇలాంటి దాతలు ముందుకు రావడం అభినందనీయమ న్నారు. ఈ కార్యక్రమంలో కింది బస్తి కాలనీ వాసులు, తదితరులు ఉన్నారు.