Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆకర్షణీయంగా కమ్యూనిస్టు అగ్రనేతల చిత్రపటాలు
స్ఫూర్తి రగిలించేలా కొటేషన్లు
కోవిడ్ నిబంధనాల మేరకు సీపీఐ(ఎం)
రాష్ట్ర 3వ మహాసభలు
సభా ప్రాంగణంలో ప్రత్యేక వైద్య సదుపాయాలు
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
ఎటు చూసినా ఎర్రజెండా రెపరెపలు... స్వాగతం పలికే ఎర్ర తోరణాలు... మహనీయుల చిత్రపటాలు.. స్ఫూ ర్తి రగిలించే మహానేతల కొటేషన్లు... ఇవీ సీపీఐ(ఎం) రాష్ట్ర మూడో మహాసభల ప్రాంగణంలోని దృశ్యాలు. పోరాటాల ఫ్లెక్సీలు, మహనీయుల చిత్రపటాలు ప్రతినిధులను కండ్లార్పకుండా చూసేలా, ఆలోచింపజేసేలా ఏర్పాటు చేయబడ్డాయి. ప్రాంగణం ప్రారంభంలో బొంబాయిలోని నౌకాశ్రయంలో జరిగిన నేవి ఉద్యోగులు తిరుగుబాటు స్మరిస్తూ '' ఎగిసిన కెరటం రాయల్ నేవి తిరుగుబాటు'' అనే కొటేషన్‌తో ఏర్పాటు చేసిన చిత్రం అకట్టుకుటుంది. ఒక్కడు గు ముందుకేయగానే తెలంగాణ రైతాంగ సాయుధ పో రాటం గుర్తు చేస్తూ 'తిరుగబడ్డ తెలంగాణ' అనే సజీవ దృశ్యాన్ని అవిష్కరింపజేశారు. వీరనారి ఐలమ్మ పోరాట పటి మను గుర్తు చేస్తూ.. ఆమె చిత్ర పటాన్ని ఏర్పాటు చేశారు. ప్రాణాలను సైతం పణంగా పెట్టి ఉరితాళ్లను ముద్దాడి యువతలో స్వాంతంత్రోద్యమ కాంక్షను రగించిన భగత్ సింగ్, రాజ్ గురు, సుఖుదేవ్ చిత్ర పటాలను ' అమర జ్యోతులు ' పేరుతో చిత్ర పటాలు ఏర్పాటు చేశారు. ఆదివా సీల హక్కుల కోసం పోరాడిన ముద్దు బిడ్డ కొమరం బీమ్ చిత్రపటం ' తెగువకు ప్రతిరూపం ' పేరుతో... సమ సమా జ హితం కోసం పరితపించిన సీపీఐ(ఎం) ప్రధమ ప్రధాన కార్యదర్శి ఆదర్శ ముర్తి క్రామేడ్ పుచ్చలపల్లి సుందరయ్య ముఖ చిత్రాన్ని ప్రదర్శించారు. ప్రతినిధుల హాల్లో ప్రపంచ విప్లవకారుడు చేగువేరా, రష్య విప్లకారుడు లెనిన్ , కమ్యూనిస్టు మహాపాధ్యాయులు కారల్‌మార్క్స్, ఎగెల్స్ చిత్రపటాలు వారి సూక్తులు ప్రతినిధుల మధులను తొలిచేలా చిత్రికరించారు.. అమరులను స్మరించుకుం టూ.. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధులు, భూ పోరాటల్లో అమరులు, కమ్యూనిస్టు ఉద్యమాల్లో అసులు బాసిన అమరులు.. రంగారెడ్డి జిల్లాలో ప్రాంతంలో అమరు లైన పోచమోని జంగయ్య, దానయ్య, పోషయ్య, అడివయ్య, కొటప్పలను , పాషా, నరహరిల చిత్ర పటాలు యువతను ఆకర్షించేలా... వారి త్యాగాల పటిమను భవిష్యత్ ఉద్యమాలకు దారితీసేలా ఉన్నాయి.
మహాసభకు విచ్చేసిన ప్రతినిధుల ఆరోగ్య దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు ఇవ్వకుండా.. ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటూ ప్రత్యేక వైద్య కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం కోవిడ్ విజృంభిస్తున్న సందర్భంలో మహాసభలో ప్రతినిధులకు కోవిడ్ పాజిటివ్ వచ్చినప్పటికీ వారి వైద్యం కోసం ప్రత్యేక ఏర్పాట్లతో ఐసోలేషన్ సెంటర్లు ఏర్పాటు చేశారు.