Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎరుపెక్కిన యంజాల్
మహాసభలు ప్రారంభం ఉత్సాహ పురితం
జెండా ఆవిష్కరణ చేసి సభలను ప్రారంభించిన సారంపల్లి
అమరుల స్తూపానికి నివాళ్లులర్పించిన ప్రతినిధులు
హాజరైన సభ్యులు పోలిట్ భ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు, ప్రకాష్ కారత్,
సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
సౌహార్థసందేశమిచ్చి సీపీఐ(ఎం) ఏపీ కార్యదర్శి శ్రీనివాసరావు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి
సున్నం రాజయ్యనగర్, మస్కు నర్సింహ, కుంజబుజ్జి ప్రాంగణంలో సభలు ప్రారంభం
జిల్లా ఉద్యమం, భౌగోళిక స్వరూపం నివేదించిన కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి
33 జిల్లాల నుంచి హాజరైన ప్రతినిధులు
ఉదయం ఎనిమిది గంటలకే ప్రాంగణానికి చేరుకున్న రాష్ట్ర నేతలు
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
సీపీఐ(ఎం) రాష్ట్ర మహాసభలు ఉత్సాహపూరితంగా ప్రారంభమయ్యాయి. సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు సారంపల్లి మల్లారెడ్డి ఎర్రజెండా ఆవిష్కరణ చేసి మహాసభలను ప్రారంభించారు. అమరవీరుల స్థూపానికి పోలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు, రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని తదితర రాష్ట్ర, జిల్లాల నుంచి వచ్చి ప్రతినిధులు పుష్పగుచ్ఛాలతో నివాళులర్పించారు. ఈ మహాసభల్లో పోలిట్భ్యూరో సభ్యులు ప్రకాష్ కారత్, బీవీ రాఘవులు, రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంతో పాటు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి వీ.శ్రీనివాసరావు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి హాజరయ్యారు. ఇరువురు తమ సౌహార్థ సందేశానిచ్చారు. సీపీఐ(ఎం) మహాసభలు విజయవంతాన్ని ఆకాంక్షించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై నిరసించారు. ఇరువురు ఉభయ కమ్యూనిస్టు పార్టీలు ఐక్యతను, దేశానికి కమ్యూనిస్టు పార్టీల అవసరాన్ని నొక్కి చెప్పారు. ఈ మహాసభల్లో రంగారెడ్డి జిల్లా ఉద్యమ చరిత్ర, ప్రస్తుత పరిస్థితులపై కేంద్ర కమిటీ సభ్యులు, జిల్లా పర్యవేక్షకులు చెరుపల్లి సీతారాములు నివేదించారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారసత్వం కలిగిన రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో పార్టీ పునాదులు చెక్కు చెదర లేదని చాటి చెప్పారు. కృష్ణమూర్తి సారథ్యంలో పోచమోని జంగయ్య, అడివయ్య, బర్ల శివయ్య, జంగారెడ్డి వంటి నాయకుల త్యాగాలు, పోరాటాలు, ఉద్యమ విస్తరణకు ఎంతగానో దోహదం చేశాయని గుర్తు చేశారు. ఒకప్పుడు నల్గొండ జిల్లా పరిధిలో ఉన్న ఇబ్రహీంపట్నం నియోజకవర్గం స్వతంత్రంగా ఏర్పడిన తర్వాత ఇబ్రహీంపట్నం కేంద్రంగా పార్టీ కార్యకలాపాలు సాగాయని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా ఉద్యమ విస్తరణకు పునాది పడిందని గుర్తుచేశారు. నేటి యువతరం సీపీఐ(ఎం) పార్టీ అభివద్ధిని కాంక్షిస్తూ ఉన్నారని గుర్తు చేశారు.
మహాసభ సైడ్ లైన్స్..
- సీపీఐ(ఎం) రాష్ట్ర మూడవ మహాసభలు ఆదివారం ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యాయి.
- ఉదయం 8 గంటల నుంచి రాష్ట్ర నాయకత్వం నాయకులు యంజాల్లో జరుగుతున్న మహాసభలకు హాజరయ్యారు.
- ఉదయం 10 గంటలకు మహాసభలను సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు సారంపల్లి మల్లారెడ్డి జెండా ఆవిష్కరణ చేసి సభను ప్రారంభించారు. ఈ సందర్భంగా అమరవీరుల స్థూపానికి నేతలు నివాళ్లు అర్పించి శ్రద్ధాంజలి ఘటించారు.
- 10:30 గంటలకు జిల్లా ఉద్యమ నేపథ్యం, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం వారసుల త్యాగాలపై జిల్లా పరిశీలకులు చెరుపల్లి సీతారాములు ప్రసంగించారు.
- ఉదయం 11 గంటలకు జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి ఆన్ లైన్ ద్వారా ప్రారంభ ఉపన్యాసం చేశారు.
- 11:50గంటలకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి తమ సౌహార్థ సందేశాన్నిచ్చారు.
- 12:05 గంటలకు సీపీఐ(ఎం) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన కార్యదర్శి వీ. శ్రీనివాసరావు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ఉభయ రాష్ట్రాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలపై తూర్పారబట్టారు.
- 12:15 గంటలకు తమ్మినేని వీరభద్రం రాజకీయ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.
- 12:46 గంటలకు తమ్మినేని వీరభద్రం ప్రవేశపెట్టిన రాజకీయ తీర్మానంపై కేంద్ర కమిటీ సభ్యులు ఎస్.వీరయ్య బలపరుస్తూ కార్మిక చట్టాలు ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీరును విమర్శించారు.
- మధ్యాహ్నం 1:05 గంటలకు ప్రతినిధులకు టీ విరామం ఇచ్చారు.
- 01: 10 గంటలకు మహాసభ ప్రాంగణంలోకి కేంద్ర పోలిట్భ్యూరో సభ్యులు ప్రకాష్ కరత్ సమావేశ ప్రాంగణంలోకి వచ్చారు.
- మహాసభల సందర్భంగా వచ్చిన ప్రతినిధులకు ఎప్పటికప్పుడు వైద్య సేవలందించేందుకు వైద్య బృందం మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసింది.
- కోవిడ్ నిబంధనల మధ్య సభలు కొనసాగుతున్నాయి.