Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి
వర్గ సభ్యులు రాజు
ఎస్ఎఫ్ఐ నుంచి జిల్లా కార్గదర్శివర్గ సభ్యుడిగా ప్రస్థానం
నవతెలంగాణ-ఫరూఖ్ నగర్
షాద్నగర్లో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న సమయం నుండే ఎస్ఎఫ్ఐ లో చేరారు. విద్యార్థి ఉద్యమలపై పోరాటం సాగించిన ఘనత రంగారెడ్డి జిల్లా సీపీఐ(ఎం) కార్యదర్శి వర్గ సభ్యులు ఎన్.రాజుది పార్టీ ప్రస్థానం. ఎస్ఎఫ్ఐలో చేసిన పని విధానం నచ్చి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడిగా ఉద్యమాలు చేశారు. ఉద్యమ కాలంలో భూ పోరాటాలు చేసి మూడు వందల గుడిసెలు వేయించారు. ఫరూఖ్ నగర్ మండలంలోని చింతగుడా గ్రామంలో రెండు వందల మందికి ఇండ్ల స్థలాల పట్టాలు ఇప్పించారు. 2002-2004 వరకు ఎన్నో నిర్బంధాలు విధించిన దేనికి వెనకంజ వేయకుండా పార్టీ అభివృద్ధి కోసం కృషి చేసిన ఘనత ఆయనది. స్థానికంగా ఉన్న కంపెనీల్లో సమస్యలను ఎప్పటికప్పుడు తీరుస్తూ ఎందుకు సాగుతున్నారు. తెలంగాణ ఏర్పాటు అయ్యాక జిల్లాలు విభజన కారణంగా రంగారెడ్డి జిల్లాలో ఉద్యమాలు చేయడం మొదలు పెట్టారు. అతని ఉద్యమ నేపథ్యంలో భాగంగానే షాద్నగర్లో జరిగిన సీపీఐ(ఎం) పార్టీ జిల్లా మహాసభల్లో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులుగా రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు. రంగారెడ్డి జిల్లా పార్టీ అభివృద్ధి కోసం తన శక్తి వంచన లేకుండా ఉద్యమాన్ని నడిపిస్తూ ముందుకు వెళ్తున్నారు.