Authorization
Mon Jan 19, 2015 06:51 pm
టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఏమిరెడ్డి జైపాల్ రెడ్డి
నవతెలంగాణ - మాడ్గుల
ఈ నెల 25న మండల రైతు సమన్వయ సమితి ప్రమాణ స్వీకారోత్సవం కార్యక్రమం నిర్వహిస్తు న్నట్టు టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఏమిరెడ్డి జైపాల్ రెడ్డి తెలిపారు. మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మండల కేంద్రంలోని వాసవి ఫంక్షన్ హాల్ లో ఉదయం 10 గంటలకు సమావేశం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, విద్యాశాఖ మంత్రి సబితఇంద్రారెడ్డి, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షులు పల్లా రాజేశ్వర్రెడ్డి, నాగర్కర్నూల్ పార్లమెంట్ సభ్యులు పోతుగంటి రాములు, కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, జడ్పీ చైర్మన్ అనితా రెడ్డి తదితరులు హాజరవుతున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల మాజీ అధ్యక్షులు గౌని లాలయ్య గౌడ్, సీనియర్ నాయకులు పవన్ కుమార్ రెడ్డి, జార్జి రెడ్డి, రాజమోని జంగయ్య యాదవ్, ఉడతల చలమంద గౌడ్, టీఆర్ఎస్ యూత్ నాయకులు వెంకటగిరి, ఎం.విష్ణు నేత, అన్నిపాక మహేష్, మల్లేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.