Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బీఎస్పీ పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్
నవతెలంగాణ-బంట్వారం
బహుజనులంతా ఏకమై రాజ్యాధికారం సాధించాల ని, రాబోయేది బహుజన రాజ్యమేన ని తెలంగాణ రాష్ట్ర బీఎస్పీ పార్టీ కో ఆర్డినేటర్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. మండలంలోని తుర్మామిడి గ్రామానికి చెందిన యువకులు, ఇతర పార్టీల నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, వికారాబాద్ జిల్లా పార్టీ సెక్రటరీ పెద్ద అంజయ్య ఆధ్వర్యంలో బీఎస్పీలో చేరారు. వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో బహుజన్ సమాజ్ పార్టీ మండల ఇన్చార్జి ధరియపురం రమేష్, పార్టీ మండల ప్రధాన కార్యదర్శి విజరు, మండల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.