Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వికారాబాద్ కలెక్టరేట్
వికారాబాద్ పట్టణంలోని బూత్ నెంబర్ 144.145 బూత్‌ల్లో నిర్వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యాక్రమాన్ని కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు సుధాకర్‌రెడ్డి మంగళవారం పర్యావేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ కాంగ్రెస్ కార్యకర్త అందరూ పార్టీ అభివృద్ధికి కృషి చేయాలన్నారు.పీసీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి కార్యకర్తలు ధైర్యంగా ఉండాలనే మంచి ఉద్దేశంతోనే రూ.2లక్షల ప్రమాద బీమా కార్యక్రమాన్ని చేపట్టినట్టు చెప్పారు. పట్టణంలో అత్యధికంగా సభ్యులు నమోదు చేస్తామని దీమా వ్యక్తం చేశారు.రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీ వచ్చేలా కృషి చేయాలని కార్యకర్తలకు సూచించారు.ఈ కార్యక్రమంలో బూత్ ఎన్‌రోలర్స్ మిర్యాణం సురేష్, విజరుకుమార్, రహీం నాయకులు, శ్రీనివాస్ ముదిరాజ్, మహేశ్, సాయికుమార్, ఖలీల్, వినరు కుమార్ తదితరులు పాల్గొన్నారు.