Authorization
Mon Jan 19, 2015 06:51 pm
షాబాద్ పశు వైద్యురాలు స్రవంతి
నవతెలంగాణ-షాబాద్
జీవాలకు రోగాలు రాకుండా ముందస్తుగా టీకాలు వేయించాలని షాబాద్ పశువైద్యాధికారి స్రవంతి రైతులకు సూచించారు. మంగళవారం షాబాద్ మండలంలోని కుమ్మరిగూడ, అంతారం గ్రామాల్లో ఏర్పాటు చేసిన పశువైద్య శిబిరాలంలో జీవాలకు టీకాలు వేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ జీవాలకు పారుడు రోగం రాకుండా ముందుగా టీకాలు వేస్తున్నట్టు తెలిపారు. ప్రభుత్వం ఉచితంగా వేస్తున్న టీకాలను రైతులు తమ జీవాలు వేయించుకోవాలన్నారు. జీవాల అభివృద్ధికోసం ప్రభుత్వం ప్రత్యేకంగా చర్యలు తీసుకుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు, పశువైద్యసిబ్బంది, రైతులు తదితరులు ఉన్నారు.