Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చేవెళ్ల
రిపబ్లిక్ డే వేడుకల్లో అంబేద్కర్ ఫొటో పెట్టాలని ఆలిండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి బేగరి రాజు అన్నారు. మంగళ వారం చేవెళ్ల మండలంలో ముఖ్య కార్యకర్తల సమా వేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత సాంఘిక, ఆర్థిక, రాజకీయ, న్యాయం జరిగినప్పుడే అందరికీ సమాన అవకాశాలు దక్కుతాయనీ, భావిం చిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని తెలిపారు. సార్వత్రిక, సామ్యవాద, లౌకిక ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యాం గాన్ని నిర్మించాలనే సదుద్దేశంతో 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పాటు శ్రమించి, భారత రాజ్యాంగాన్ని లిఖించారని కొనియాడారు. తాను రాసిన రాజ్యాంగ ప్రతులను 1949 నవంబర్ 26 న సమర్పించారనీ, దానిని ఆమోదించిన భారత ప్రభుత్వం1950 జనవరి26 రాజ్యాంగాన్ని అమల్లోకి తెచ్చిందన్నారు. అప్పటినుంచి రిపబ్లిక్ డే జరుపుకుంటున్నామని వివరించారు. ఈ వేడుకల్లో అంబేద్కర్ చేసిన సేవలు తెలియజేక పోవడమే కాకుండా, కనీసం ఫొటో కూడా పెట్టకుండా విస్మరిస్తున్నారని అన్నారు. విద్య, ఉద్యోగ రాజకీయ రంగాల్లో రిజర్వేషన్లు, ఓటు హక్కు, జీవించే హక్కు, సమానత్వ హక్కు ఇలా ప్రజల కోసం ఎన్నో హక్కులను అంబేద్కర్ రాజ్యాంగంలో పొందు పరిచారని గుర్తు చేశారు. అంబేద్కర్ లేకుంటే అసలు భారత రాజ్యాం గమే లేదన్నారు. ఇప్పటికైనా రిపబ్లిక్ వేడుకల్లో డాక్టర్ అంబేద్కర్ ఫొటో పెట్టాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఆలిండియా అంబేద్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు బేగరి మహేష్, ఆలిండియా అంబేద్కర్ యువజన సంఘం జిల్లా మాజీ ఉపాధ్య క్షులు రాహిని శ్యామ్ రాజ్, ఆలిండియా అంబేద్కర్ యువజన సంఘం చేవెళ్ల డివిజన్ అధ్య క్షులు బేగరి ప్రభాకర్, ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు బేగరిఅరుణ్, సామేల్, దశరథ్, తదితరులు పాల్గొన్నారు.