Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఫరూఖ్ నగర్
ఫరూఖ్ నగర్ మండల పరిధిలోని మొగిలిగిద్ద గ్రామానికి చెందిన శైలజ అనే విద్యార్థిని తీగల కృష్ణారెడ్డి ఫార్మా కళాశాలలో బి ఫార్మసీ చదువు తుంది. ఫీజు కట్టలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్నీ గ్రామస్తుల ద్వారా తెలుసుకున్న ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ బండారి రమేశ్ రూ.35 వేలు అందజేశారు. ఫీజు చెల్లించలేని శైలజ తల్లి అంజమ్మ ఆర్థిక పరిస్థితి చూసి, చలించి ఆమె చదువు మధ్యలో ఆగిపో కూడదనే ఉద్దేశంతోనే బండారి రమేష్ ఆర్థిక సహాయం అందజేసినట్టు వివరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు శారద, విజరు కుమార్, ప్రేమ్ సాయి కుమార్, నాగ వర్ధన్ రెడ్డి, కేఎల్ కుమార్, లయన్ కమ్మదనం సుధాకర్ పాల్గొన్నారు.