Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కేశంపేట
మండల పరిధిలోని కొత్తపేట గ్రామంలో ఉపాధి పనులు ప్రారంభించినట్టు సర్పంచ్ నవీన్‌కుమార్ అన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ జాబ్ కార్డులు తీసుకున్న ప్రతి ఒక్కరూ ఉపాధి పనుల్లో పాల్గొ నాలని అన్నారు. గ్రామంలో నిర్వహించే ఉపాధి పనులను వందశాతం పూర్తి చేయాలన్నారు.ఉపాధి పనులపై కూలీలకు సంబంధిత అధికారులు పూర్తి అవ గాహన కల్పించాలన్నారు. కూలీలకు జాప్యం చేయకుండా డబ్బులు అందిం చాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ మల్లేష్‌యాదవ్, కో-ఆప్షన్ సభ్యులు జమాల్ ఖాన్, వార్డ్ సభ్యులు అరుంజ్యోతి జగన్ రెడ్డి, కాకునూర్ కృష్ణ, పంచాయతీ కార్యదర్శి మల్లేష్, నాయకులు బండారి దశరథ, ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు.