Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-శంకర్పల్లి
శంకర్పల్లి మండలంలో 36 కరోనా కేసులు నమోదైనట్టు టంగుటూరు ప్రభుత్వాస్పత్రి వైద్యాధికారి శంకర్పల్లి ఇన్చార్జి సత్యజ్యోతి తెలిపారు. మంగళవారం శంకర్పల్లి ప్రభుత్వాస్పత్రిలో 68మందికి పరీక్షలు నిర్వహించగా 22 మందికి పాజిటివ్ వచ్చినట్టు వైద్యాధికారులు తెలిపారు. శంకర్పల్లి పట్టణ కేంద్రంలో 10, మోకిలా జన్వాడలో 1, బీడీఎల్‌లో 2, ఓడిఎఫ్‌లో 1, సింగపూర్‌లో 1, చందిప్పలో 1, మల్కాపూర్‌లో 1 కేసులు నమోదైయ్యాయి. అదేవిధంగా టంగుటూరు ప్రభుత్వాస్పత్రిలో 35 మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా 14 మందికి పాజిటివ్ వచ్చినట్టు వైద్యాధికారులు తెలిపారు. అనంతరం వైద్య అధికారులు మాట్లాడుతూ ప్రజలందరూ కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి,భౌతిక దూరం పాటించాలని సూచించారు. కరోనా వచ్చినవారికి మందులు, వైద్య సలహాలు, సూచనలు చేస్తున్నట్టు తెలిపారు.
శంకర్పల్లి మున్సిపల్ కార్యాలయంలో 6 పాజిటివ్ కేసులు
శంకర్పల్లి మున్సిపల్లో పని చేసే ఆరుగురి ఉద్యోగులతో పాటు, మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో కూడా ఇద్దరికీ కరోనా పాజిటివ్ వచ్చినట్టు సమా చారం. మున్సిపల్ కార్యాలయంలో 18 మంది కరోనా పరీక్షలు చేసుకోగా, వారిలో ఆరుగురికి పాజిటివ్ వచ్చింది.వారితో కలిసి పనిచేసిన సహౌ ద్యోగులు కూడా వైద్య పరీక్షలు చేయించుకోవాలని పలువురు అభిప్రా యపడుతున్నారు. అదేవిధంగా మండల మండల ప్రజా పరిషత్ కార్యాల యంలో సిబ్బందికి ఇద్దరికి, గ్రామ కార్యదర్శికి కరోనా పాజిటివ్ వచ్చినట్టు సమాచారం. వీరందరూ కూడా వారం రోజుల పాటు హోం ఐసోలేషన్‌లో ఉంటూ, డాక్టర్ సలహాలు పాటించాలని పలువురు కోరుతున్నారు.