Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కొత్తూరు మున్సిపల్ కమిషనర్ వీరేందర్
నవతెలంగాణ-కొత్తూరు
కులానికో, మతానికో కాకుండా దేశ అభ్యున్నతికి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కొత్తూరు మున్సిపల్ కమిషనర్ వీరేందర్ అన్నారు. మంగళవారం కొత్తూరు మున్సిపాలిటీ కార్యాలయం లో కమిషనర్ వీరేందర్ ఆధ్వర్యంలో జాతీయ ఓటర్ల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ సిబ్బంది, ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..ప్రజాస్వామ్య దేశంలో ఓటు చాలా కీలకమైనదనీ, కులమ తాలకు అతీతంగా ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు.ఎన్నికల సమ యంలో మద్యానికి డబ్బులకు అమ్ముడు పోకుండా నిస్వార్థంగా నిజాయితీగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నాప్పుడే దేశ అభివృద్ధి జరుగు తుందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ డోలి రవీందర్, నాయకులు బాతుక దేవేందర్ యాదవ్, బ్యాగరి యాదయ్య, కమ్మరి జనార్ధన్చారి, కుమ్మరిగూడెం మహేష్ గౌడ్, బండి శ్రావణ్, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.