Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జడ్పీటీసీ నేనావత్ అనురాధ పత్య నాయక్
నవతెలంగాణ-ఆమనగల్
అనారోగ్యంతో బాధపడుతున్న వారు సీఎం సహాయ నిధిని సద్వినియోగం చేసుకోవాలని జడ్పీటీసీ సభ్యులు నేనావత్ అనురాధ పత్య నాయక్ అన్నారు. ఆమనగల్ మున్సిపాలిటీ పరిధిలోని విఠాయిపల్లి గ్రామానికి చెందిన రఘుమారెడ్డికి వైద్య ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన రూ.లక్షా 25 వేల చెక్కును మంగళ వారం అందజేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ అనారోగ్యంతో బాధపడుతూ ప్రయివేట్ ఆస్పత్రిలో చికిత్స పొందిన వారు, వైద్య ఖర్చుల నిమిత్తం సీఎం సహాయ నిధిని సద్వినియోగం చేసుకోవాలని సూచిం చారు. మండలంలో అలాంటి బాధితులు ఎవరైనా ఉంటే వారికి కల్వకుర్తి శాసనసభ్యులు గుర్క జైపాల్ యాదవ్ సహకారంతో ముఖ్యమంత్రి సహాయ నిధి అందించేందుకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ ఆమనగల్ మున్సిపాలిటీ అధ్యక్షుడు నేనావత్ పత్య నాయక్, సర్పంచ్ ప్రేమలత నర్సింహా, ఉపసర్పంచ్లు మల్లేష్‌నాయక్, ప్రశాంత్ నాయక్, ఏఎంసీ డైరెక్టర్ రమేష్‌నాయక్, నాయకులు రూపం వెంకట్ రెడ్డి, ఉప్పుల రాములు యాదవ్, డేరంగుల వెంకటేష్, మురళి, నారాయణరెడ్డి, గణేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.