Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-రాజేంద్రనగర్
రూ.11 వేల కోట్లతో పూర్తిగా అంతర్జాతీయ ప్రమాణాలతో మూసీ అభివృద్ధి పనులు నిర్వ హిస్తున్నట్టు మూసి డెవలప్మెంట్ చైర్మెన్ సుధీర్ రెడ్డి అన్నారు. మంగళవారం హైదర్‌గూడ వద్ద మూసి వాగును చేవెళ్ల ఎంపీ డాక్టర్ రంజిత్ రెడ్డి, రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్‌తో కలిసి పరిశీ లించారు. ఈ సందర్భంగా సుధీర్ రెడ్డి మాట్లా డుతూ మూసిని పూర్తిస్థాయిలో సుందరీకరించేందు కు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. వాగుకు ఇరువైపులా పెద్ద రోడ్లను నిర్మిస్తు న్నామన్నారు. ప్రధాన ప్రాంతాల్లో అవసరమైన చోట వంతెన నిర్మించడానికి ప్రతిపాదనలు కూడా సిద్ధం చేస్తున్నామని చెప్పారు.వచ్చే ఏడాది లోపు అన్ని పనులు పూర్తయ్యే విధంగా అధికారులు కృషి చేస్తున్నట్టు స్పష్టం చేశారు. హైెదర్గూడ వద్ద నూతన శ్మశాన వాటిక నిర్మించేంత వరకూ పాత శ్మశాన వాటికను ఉప యోగించుకోవచ్చని తెలిపారు. చేవెళ్ల ఎంపీ డాక్టర్ రంజిత్ రెడ్డి మాట్లాడుతూ ఐదెకరాల విస్తీర్ణంలో అన్ని సౌకర్యాలతో హైద ర్గూడాలో నూతన శ్మశాన వాటిక నిర్మించడానికి అన్ని చర్యలు తీసుకుం టామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు వనం శ్రీ రామ్ రెడ్డి ,సురేందర్ రెడ్డి ,సురేష్ రెడ్డి వెంకటేష్, శ్రీనివాస్ పాల్గొన్నారు.