Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-శంకర్పల్లి
గోపులారం నుంచి చిన్నమంగళారం వెళ్లేందుకు మూసీవాగు వర్షాకాలంలో ప్రవహించడంతో రాకపోకలకు ఇబ్బందులు ఎదుర్కొవల్సి వస్తుందనీ, ఈ వాగుపై బ్రిడ్జీ నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని గోపులారం గ్రామ సర్పంచ్ పొడువు శ్రీనివాస్ ఆధ్వర్యంలో గ్రామస్తులతో కలిసి చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్యకు విన్నవించుకున్నారు. ఎమ్మెల్యే స్పందించి పంచాయతీరాజ్ ద్వారా రూ.5 కోట్లు బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరు చేయించినట్టు సర్పంచ్ మంగళవారం తెలిపారు. మూడు నెలల క్రితం గోపులారం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి వాగులో పడి మృతి చెందిన ఘటన తెలిసిందే. దీంతో వంతెన నిర్మించాలని అధికారులు నిధులు మంజూరు చేయాలని కృషి చేసిన గ్రామ సర్పంచ్‌కు పలువురు అభినందనలు తెలిపారు. ఈ వంతెన నిర్మాణం పూర్తయితే రెండు గ్రామాల ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. అంతే కాకుండా మొయినాబాద్ మండలానికి వెళ్లాలన్నా, చుట్టూ తిరిగి 20 కిలోమీటర్లు వెళ్లాల్సి వస్తుందనీ, ఈ వంతెన నిర్మిస్తే, ఆరు కిలోమీటర్లు దూరం మాత్రమే ఉంటోందన్నారు. బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరు చేయడంతో గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు.ఈ వంతెనకు రూ. 5 కోట్ల నిధులు మంజూరు చేసినందుకు సీఎం కేసీఆర్‌కు,చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్యకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.