Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు
పట్టించుకోని ఆర్అండ్బీ అధికారులు
నవతెలంగాణ-తాండూరు రూరల్
తాండూరు మండలం కరణ్కోట గ్రామానికి తాండూరు నుంచి ఊరు వరకు 20 నిమిషాల్లో చేరుకోవాలి. కానీ గౌతాపూర్ చెక్పోస్ట్ నుంచి గోపన్ పల్లి వరకు రోడ్డంతా మోకాళ్లలోతు గుంతలు పడ్డాయి. అంతేకాకుండా ఆ దారిపై మట్టికొట్టుకుపోవడంతో వాహనదారులు నిత్యం ఇబ్బందులు ఎందుర్కొంటున్నారు. ఆ గ్రామానికి తాండూరు నుంచి వెళ్లేందుకు ఒకగంట సమయం పడుతుంది.ఈ రోడ్డు గుండా నిత్యం అధిక సంఖ్యలో సిమెంట్ ప్యాక్టరీల లారీలు ఎర్రమట్టి లారీలు తిరుగుతుండటం వల్ల దుమ్ము విపరీతంగా లేస్తుంది.ఈ దుమ్ముతో ఎదురుగా వచ్చే వాహనాలు కూడా కనిపించడం లేదని పలువురు ఆందోళన చెందుతున్నారు. ద్విచక్ర వాహన దారులకు పెద్ద వాహనాలు ఎదురైతే, పక్కకు నిలబడి వెళ్లే పరిస్థితి ఏర్పడింది. కమ్ముకుపోయిన ఆ దుమ్ముతో ఎదురుగా వచ్చే బండ్లు కూడా కనిపించని పరిస్థితి నెలకొందని పలువురు ఆందోళన చెందుతున్నారు.ఈ విషయంపై రోడ్లు మరమ్మతులు చేయాలని అధికారుల దృష్టికి తీసుకెళ్లితే, మరమ్మతులు చేస్తామని చెబుతున్నారని కానీ, పనులు నిర్వహించడంలో నిర్లక్ష్యం వహిస్తు న్నారని స్థానికులు విమర్శిస్తున్నారు. దీంతో నిత్యం ఆ రోడ్డు గుండా తిరిగే వాహనాలతో బెల్కటూరు, గోపన్పల్లి, చంద్రవంచ, కరణ్కోటా, ఓగిపూర్ గ్రామాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొవల్సి వస్తుంది.రోడ్డు బాగుంటే, ఇరవై నిమిషాల్లో తాండూరు చేరుకునే అవకాశం ఉంది. కానీ గుంతలు పడి ఉండ టంతో గంటలపాటు ప్రయాణం చేయాల్సి వస్తుంది. అత్యవసర సమయంలో చాలా ఇబ్బందులు పడాల్సి వస్తోందని ఆందోళన చెందుతున్నారు.ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి, త్వరగా రోడ్డు మరమ్మతులు చేపట్టాలని ఆయా గ్రామాల ప్రజలు, వాహనదారులు కోరుతున్నారు.