Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి
నవతెలంగాణ-పరిగి
క్రీడారంగానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి అన్నారు. మంగళవారం పరిగి మండల పరిధిలోని గడ ిసింగాపూర్ గ్రామంలోగోవిందాపూర్ సుజాతమ్మ స్మారకార్థం సర్పంచ్ల సంఘం జిల్లా అధ్యక్షులు అశోక్‌రెడ్డి ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ నిర్వహించారు. ఈ సంద ర్భంగా గెలుపొందిన జట్లకు ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి, గ్రంథాలయ చైర్మెన్ మురళీకృష్ణగౌడ్ బహుమతులు అందజేశారు. గెలుపొందిన ప్రెస్ లెవెల్ జట్టుకు రూ.30 వేలు, రన్నర్‌గా నిలిచిన గడి సింగపూర్ జట్టుకు రూ.15 వేలు అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ క్రీడల్లో గెలుపోటములు సహజ మన్నారు. ఎంతోమంది మట్టిలో మాణిక్యంలాంటి క్రీడాకారులు గ్రామీణ ప్రాంతంలో ఉన్నారనీ, వారిని ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. క్రీడాకారులు ఇటువంటి వేదికలను ఉపయోగించుకుని, ప్రతిభను కనబరచాలని సూచించారు. ప్రతి సంవత్సరం గోవిందాపూర్ సుజాతమ్మ పేరుతో వారి కుమారుడు అశోక్ రెడ్డి, ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగకు క్రికెట్ టోర్నమెంట్ నిరవ్రహించడం అభినందనీయమని తెలిపారు. వారిని ఆద ర్శంగా తీసుకుని ప్రజాప్రతినిధులు కూడా క్రికెట్ పోటీలు నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో పరిగి మున్సిపల్ చైర్మన్ ముఖం అశోక్ కుమార్, సిఏపీఎస్ వైస్ చైర్మన్ భాస్కర్, సర్పంచులు వెంకట రామకృష్ణారెడ్డి, మధుసూదన్‌రెడ్డి, శ్రీనివాస్, వెంకటయ్య, జగన్, టీఆర్ఎస్ పరిగి మండల అధ్యక్షుడు అంజనేయులు, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు ప్రవీణ్ రెడ్డి, మీర్ తాహెర్ ఆలి, రవి, మంగు సంతు, జనార్ధన్‌రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, మాణిక్యం, తదితరులు పాల్గొన్నారు.