Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-శంకర్పల్లి
ఆగిఉన్న లారీ వెనుకనుంచి బైక్‌తో ఢికొట్టి యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన ఏరువగూడ గేటు గేటు సమీపంలో సోమవారం రాత్రి జరిగింది. శంకర్పల్లి పోలీస్ స్టేషన్ సీఐ మహేశ్‌గౌడ్ తెలిపిన వివ రాల ప్రకారం శంకర్పల్లి మండలంలోని పరివేద గ్రామానికి చెందిన బేగరి పాండు (25) శంకర్పల్లి మండల కేంద్రంలో ఎలక్ట్రిషన్ షాపులో పని చేస్తు న్నాడు. ఎప్పటిలాగే పని ముగించుకుని, రాత్రి 9:30 ప్రాంతంలో స్వగ్రా మానికి బైక్‌పై వెళ్లుతుండగా, మండల పరిధిలోని ఏరువాగూడ గేట్ సమీ పంలో ఆగి ఉన్న లారీని వెనకనుంచి ఢకొీట్టడంతో తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు.మృతునికి నాలుగేండ్ల క్రితమే వివాహం జరి గింది. భార్య ఐదు నెలల గర్భవతి. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని చేవెళ్ల మార్చురీకి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ మహేశ్‌గౌడ్ తెలిపారు.