Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రంగారెడ్డి జిల్లా కార్యదర్శి కె. భాస్కర్
రాష్ట్ర పార్టీకి కృతజ్ఞతలు
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
సీపీఐ(ఎం) రాష్ట్ర మహాసభలు రంగారెడ్డి జిల్లా ఉద్యమానికి ఎంతో ఊతమిస్తాయని, కోవిడ్ కష్ట కాలంలో మహాసభలు విజయవంతం కావడం.. 33 జిల్లాల నుంచి వచ్చిన ప్రతినిధులు తమ కృషి పట్ల అభినందనలు తెలపడం మరిచిపోలేనిదని జిల్లా కార్యదిర్శ కె.భాస్కర్ అన్నారు. మహాసభల ముగింపు సందర్భంగా మంగళవా రం ఆయన మాట్లాడారు.. ఆహ్వాన సంఘం అధ్యక్షులు చెరుపల్లి సీతారాములు సలహాలు, సూచనలు ఎంతగానే దోహదపడ్డాయని తెలిపారు. అనాతీ కాలంలోనే రాష్ట్ర మహాసభల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లను గ్రామ స్థాయి సాధారణ కార్యకర్త మొదలు జిల్లా నాయ కత్వం పూర్తిగా పార్టీ పిలుపు నందుకుని పని చేశారని తెలిపారు. వారందరికీ జిల్లా కమిటీ తరపున ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్ ఉద్యమాలకు ఈ మహాసభలతో పునా దులు వేశాయన్నారు. ఈ మహాసభలపై విస్తృత ప్రచారం చేయడంలో ప్రధానంగా వాల్ రైటింగ్ ప్రముఖ ప్రాత పోషించిందన్నారు. ఉద్యమం ఉన్న ప్రతి గ్రామంలో వాల్ రైటింగ్ రాయించడంలో జిల్లా కమిటీ కృషి అభినంద నీయమన్నారు. వీటితో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ సీపీఐ(ఎం) పార్టీ ఔనత్యాన్ని చాటే విధంగా తమ కళా ప్రదర్శనల ద్వారా ప్రజానాట్య మండలి కళాకారుల బృందం జిల్లా వ్యాప్తంగా బస్సు యాత్రను నిర్వహించిందన్నారు. రాష్ట్ర మహాసభల కోసం ఆర్థికంగా చేయుతనిచ్చిన జిల్లా ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.