Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ
నవతెలంగాణ-మియాపూర్
ఆరోగ్య తెలంగాణనే ప్రభుత్వ లక్ష్యం అని చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు రంజిత్ రెడ్డి, శేర్లింగంపల్లి శాసనసభ్యులు అరికెపూడి గాంధీ అన్నారు. మంగళవారం మియాపూర్ డివిజన్లోని పలు కాలనీల్లో ఫీవర్ సర్వేలో భాగంగా స్వయంగా ఎంపీ, ఎమ్మెల్యే పాల్గొని కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా కట్టడి కోసం ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ప్రతీ ఇంటికెళ్లి వైద్యారోగ్య సిబ్బంది ఫీవర్ పరీక్షలు చేస్తున్నారని, కోవిడ్ లక్షణాలున్న వారికి హౌంఐసోలేషన్ కిట్లు అందచేస్తున్నారని తెలిపారు. అందరూ వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో చందానగర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ సుధాంశు, స్థానిక కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, టీఆర్ఎస్ నాయకులు పురుషోత్తం యాదవ్, బి,ఏస్, ఎన్ కిరణ్ యాదవ్, గంగాధర్ రావు, మోహన్ ముదిరాజ్, ప్రతాప్ రెడ్డి, మాధవరం గోపాల్ రావు, మహేందర్ ముదిరాజ్, గోపారాజు శ్రీనివాస్ రావు, మహమ్మద్ కాజా, జంగిర్, సుప్రజా, స్వరూప, హన్మంతరావు, రాజు గౌడ్,రవి గౌడ్,శివ ముదిరాజ్, శ్రీను పాల్గొన్నారు.