Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇమ్యూనిటీ పవర్ పరిశీలన కోసం రక్త నమూనాల సేకరణ
నవతెలంగాణ- శంషాబాద్
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ బృందం శంషాబాద్ మండల పరిధిలోని పెద్ద గోల్కొండ గ్రామంలో మంగళవారం పర్యటించింది. కోవిడ్-19 నివారణ కోసం వ్యాక్సిన్ తీసుకున్న ప్రజలకు ఇమ్యూనిటీ పవర్ (రోగ నిరోధక శక్తి) ఏ మేరకు పెరిగిందో తెలుసుకోవడం కోసం గ్రామంలో పర్యటించింది. గ్రామ సర్పంచ్ కామోనిబాయి లక్ష్మయ్య ఆధ్వర్యంలో రక్త నమూనాల సేకరణ కోసం స్పెషల్ క్యాంపు ఏర్పాటు చేశారు. ఇందులో ఐసీఎంఆర్ ప్రతినిధి బృందం వ్యాక్సిన్ తీసుకున్న 45 మంది నుంచి రక్త నమూ నాలు సేకరించారు. ఈ సందర్భంగా ప్రతినిధి బృందం సభ్యులు మాట్లాడుతూ వ్యాక్సినేషన్ కార్యక్రమం మరింత విజయవంతంగా అమలు చేసే ఉద్దేశంతో వ్యాక్సిన్లో రోగ నిరోధక శక్తి, స్థిరత్వం పెరుగుదల, తగ్గుదల తదితర అంశాలను పరిశీలించి భవిష్యత్తులో మరింత మెరుగైన వ్యాక్సిన్ తయారు చేయాలనే ఉద్దేశంతో ఐసిఎంఆర్ రక్తన మూనాలను సేకరిస్తున్నదని తెలిపారు. సర్పంచ్ లక్ష్మయ్య మాట్లాడుతూ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ సంస్థ ప్రతినిధులు తమ గ్రామానికి వచ్చి పరిశీలన కోసం రక్త నమూనాలు సేకరించడం స్వాగతిస్తున్నామని అన్నారు. ఐసీఎంఆర్ మార్గదర్శకాలను ప్రతి ఒక్కరూ పాటించాలన్నారు. కరోనా కొత్త వేరియంట్ థర్డ్ వేవ్ విజృంభిస్తున్న వేళ ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. గ్రామంలో కోవిడ్ మహమ్మారి నియంత్రణ కోసం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నా మని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఏ.స్వరూపగౌడ్, ఎంపీటీసీ జి. యాదగిరి, వార్డు సభ్యులు, విలేజ్ సెక్రటరీ శ్రీకాం త్గౌడ్, జాతీయ పోషకాహార సంస్థ అధికారి ఆర్ రఘునాథ్ బాబు, శాస్త్రవేత్త గజానంద్ డోర్ సాంకేతిక అసిస్టెంట్ తులసి, ఎస్ఏఎఎన్ ఎం. విద్యులత, సూపర్వైజర్ ప్రమీ ల, ఆశావర్కర్లు శైలజ, పద్మ, లక్ష్మి, శమంత, రెహానా, సునంద, అంగన్వాడీ టీచర్లు సంతోష, వరమ్మ తదితరులు పాల్గొన్నారు.