Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పాల్గొన్న ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ
నవతెలంగాణ-మియాపూర్
చందానగర్ సర్కిల్ కార్యాలయం లో చందానగర్ సర్కిల్ పరిధిలోని మాదాపూర్, మియాపూర్, హఫీజ్పెట్, చందానగర్ డివిజన్ల పరిధిలోని పలు కాలనీలకు కేటాయించిన 34 స్వచ్ ఆటోలను మంగళ వారం ప్రభు త్వ విప్, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ స్వచ్ సర్వేక్షన్ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు పారిశుధ్య నిర్వహణలో భాగంగా చెత్త సేకరణ కోసం ఆటో లు కేటా యించినట్టు తెలిపారు. స్వచ్ హైదరాబాద్ స్వచ్ శేరిలిం గంపల్లిగా తీర్చిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాల న్నారు. తడి, పొడి చెత్తను వేరు చేసి ఇవ్వాలన్నారు. ఈ ఆటోలను కాలనీలలో సక్రమమైన మార్గంలో ఉప యోగించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీసీ సు ధాంష్ డాక్టర్ కార్తీక్, కార్పొరేటర్లు మంజుల రెడ్డి, జగదీశ్వర్ గౌడ్, ఉప్పలపాటి శ్రీకాంత్, జీహెచ్ఎంసీ సిబ్బంది శ్రీనివాస్‌రెడ్డి, మహేష్, కనకరాజు, ప్రసాద్, బాలాజీ, హ ఫీజ్పెట్ డివిజన్ అధ్యక్షులు బాలింగ్ గౌతమ్‌గౌడ్, టీఆర్ఎస్ నాయకులు మాధవరం గోపాల్, గుమ్మడి శ్రీనివాస్, రాంచందర్, రవీందర్‌రెడ్డి, అక్బర్‌ఖాన్, తదితరులు పాల్గొన్నారు.