Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కొనసాగుతున్న ఇంటింటి సర్వే
నవతెలంగాణ- శంషాబాద్
మండలంలో కొవిడ్-19 కేసుల తీవ్రత ఏ మాత్రం తగ్గడం లేదు. మండల వైద్యాధికారులు డాక్టర్ నజ్మ భాను, డాక్టర్ దివ్య డాక్టర్ రమ్య తెలిపిన వివరాల ప్రకారం మం డలంలో మంగళవారం 289 అందుకే కోవిడ్ పరీక్షలు నిర్వహించగా 49 మందికి పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. పాజిటివ్ వచ్చిన అందరికీ హౌం ఐసోలేషన్ కిట్లు అందజేశారు.
కొనసాగుతున్న ఇంటింటి జ్వర సర్వే
'మీ ఇంట్లో ఎవరికైనా జ్వరం ఉందా దగ్గు సర్ది దమ్ము ఆయాసం ఒళ్లునొప్పులు తలనొప్పి వంటి లక్షణాలు ఏమైనా ఉన్నాయా ? ఉంటే కోవిడ్ పరీక్షలు చేయించుకు న్నారా ఏ మందులు వాడుతున్నారు. వైద్యులను సంప్రదించారా..' అంటూ ఆశావర్కర్లు, అంగన్వాడీ టీచర్లు అంగన్వాడీ వర్కర్లు ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నారు. జ్వర లక్షణాలు ఉన్నవారికి ఉచితంగా టాబ్లెట్లు అందజేస్తు న్నారు. నర్కూడ గ్రామంలో మూడు రోజులుగా జర సర్వే కొనసాగుతున్నది. గ్రామంలో ఇప్పటికే జ్వరం, జలుబుతో బాధపడుతూ కోరుకున్న వారు వందల సంఖ్యలో ఉన్నారు. సుమారు 14 మంది కొవిడ్ పరీక్షలు చేయించుకుని హౌమ్ మై సొల్యూషన్‌లో ఉన్నా రు. కొంతమంది ప్రయివేటులో కొవిడ్ పరీక్షలు చేసుకుని చికిత్స పొందు తున్నారు. ఇదే పరిస్థితి అన్ని గ్రామాల్లో కొనసాగుతున్నది. నర్కూడలో జరిగిన కార్యక్రమంలో ఆశ వర్కర్ ఎన్.అమృత, అంగన్వాడీ టీచర్లు ఏం. మల్లేశ్వరి, పి నలిని, అంగన్వాడీ హెల్పర్ నందిని పాల్గొన్నారు.