Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాష్ట్ర అధినేత నిర్ణయంపై సర్వత్రి హర్షం
ఉదయం నుంచి సాయంత్రం వరకు..
కోలాహాలంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
అధికార టీఆర్ఎస్ అధినేత నిర్ణయంపై సర్వత్ర హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లా టీఆర్ఎస్ సారధిగా ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డిని ప్రకటిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించారు. దాంతో ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని టీఆర్ఎస్ శ్రేణుల్లో నూతనోత్సహం వ్యక్తమవుతోంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆయనకు పార్టీ నాయకులు, కార్యకర్తలు, శ్రేణులు అభినందన తెలిపేందుకు బారులు తీరారు. దాంతో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం జనసందోహంతో నిండిపోయింది. తన కుమారుడు, రాష్ట్ర నాయకులు మంచిరెడ్డి ప్రశాంత్‌కుమార్‌రెడ్డి, ఇబ్రహీంపట్నం మున్సిపల్ ప్రథమ చైర్మన్ కంబాలపల్లి భరత్‌కుమార్, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షులు భరత్‌రెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్ సత్తు వెంకటరమణారెడ్డి, ఇబ్రహీంపట్నం, మంచాల ఎంపీపీలు కృపేష్, నర్మద, జెడ్పీటీసీ జంగమ్మ, ఎంపీటీసీ, సర్పంచ్‌లు, మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు తదితరులు ఆయనను కలిసి అభినందనలు తెలిపారు. 1980నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లో వివిధ స్థాయిల్లో ఆయన పని చేశారు. 1980-1985 వరకు వెల్మినేడు సర్పంచ్‌గా పని చేశారు1985-1990 వరకు పీఎస్సీఎస్ చైర్మన్, డీసీసీబీ డైరెక్టర్‌గా పని చేశారు. అదే విధంగా 2002 నుంచి 2004 వరకు తెలుగుదేశం ప్రభుత్వ హాయాంలో ఏపీఎస్ఐడీసీ చైర్మన్‌గా వ్యవహరించారు. ఇదీలా ఉంటే 2009, 2014లో టీడీపీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2015లో టీడీపీని వీడి టీఆర్ఎస్లో చేరిన ఆయన 2018లో జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ప్రస్తుతం ఆయన టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా కొనసాగు తున్నారు. 1994 నుంచి 1996 వరకు టీడీపీ రంగారెడ్డి జిల్లా ప్రచార కార్యదర్శిగా పని చేశారు. 1997 నుంచి 2004 జిల్లా అధ్యక్షునిగా పని చేయగా, 2001-2004 వరకు మలక్‌పేట నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జీగా పని చేశారు. 2005 నుంచి 2009 వరకు టీడీపీ ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ఇన్‌చార్జీగా పని చేశారు. 2012 నుంచి 2015 జిల్లా టీడీపీ అధ్యక్షునిగా పని చేశారు. 2015లో టీడీపీని వీడిన ఆయన ప్రస్తుతం టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. అయితే రంగారెడ్డి జిల్లా సారధులను ఏర్పాటు చేస్తామని అధినేత కేసీఆర్ ప్రకటించిన సందర్భంగా జిల్లా అధ్యక్షులుగా పలువురు నేతల పేర్లు వినిపించినప్పటికీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి పేరు ప్రస్తావనకు కూడా రాలేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఆయా జిల్లాల్లో పేరుగాంచి, వచ్చే 2023 ఎన్నికల్లో ప్రభావం చూపే నాయకులకు ఈ బాధ్యతలు అప్పగించారు. వీరిలో పలువురు ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉండగా, మాజీ ఎంపీపీలు, డీసీసీబీ మాజీ చైర్మన్లు, చైర్మన్లు, జెడ్పీ చైర్మన్లకు జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగించడంతో 2023 ఎన్నికల శంఖారవాన్ని పూరించినట్లు రాజకీయ పరిశీలకులు బావిస్తున్నారు.