Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మున్సిపల్ ఎజెండా ఆమోదంపై
న్యాయస్థానంలో విచారణ
ఎజెండా అంశాల్లో మున్సిపల్ నిధులు దుర్వినియోగం
మున్సిపల్ కౌన్సిల్ సమావేశం మళ్లీ ఏర్పాటు చేస్తాం
అభివద్ధికి ఆటంకాలు ఉండవు పూర్తిగా సహకరిస్తాం
ప్రజాప్రతినిధుల హక్కులను కాలరాసే ప్రయత్నం చేస్తే ఊరుకునేది లేదు
మున్సిపల్ చైర్పర్సన్ తాటికొండ స్వప్న పరిమళ్, మున్సిపల్ కౌన్సిలర్లు
నవతెలంగాణ-తాండూరు
ఈ నెల 22న తాండూరు మున్సిపల్ సమావేశంలో ఎ జెండా అంశాలు ఆమోదం అని తెలియజేసిన దాని పై అలాగే చైర్ పర్సన్ సంతకం లేని ఎజెండా చట్ట వ్యతిరేకమని దీనిపై హైకోర్టు లో న్యాయ విచారణ కు పిటిషన్ దాఖలు చేసినట్లు గా తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ తాటికొండ స్వప్న పరిమల్ అన్నారు. బుధవారం తాండూరు పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి నివాసంలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ఈనెల 22న జరిగిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో ఇంచార్జ్ కమీషనర్ ఆర్డిఓ అశోక్ కుమార్ తన సంతకం లేనిదే ఏజెండాను ప్రవేశ పెట్టారని గుర్తుచేశారు. అధికారులు, ప్రతిపక్ష కౌన్సిలర్లతో కుమ్మక్కై ఆమోదించడం జరిగిందని తెలిపారన్నారు. మున్సిపల్ చట్టం 2019 ప్రకారం నిబంధనలకు వ్యతిరేకంగా ఆమోదించిన ఎజెండా పై ఈ నెల 24న హైకోర్టును ఆశ్రయించడం జరిగిందని చెప్పారు. దీన్నిపై హైకోర్టులో సానుకూలంగా ఎజెండాపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలిపారు. గురువారం దీనిపై రాతపూర్వకంగా అనుకూలమైన ఉత్తర్వులు రానున్నాయని తెలియజేశారు. చైర్ పర్సన్‌కు వ్యతిరేకంగా ఆమోదించిన ఎజెండాపై హక్కుల కోసం వేసిన ఫిటిషన్లో న్యాయం జరుగుతుందని ఆకాంక్షించారు. అధికారులు, ప్రతిపక్ష కౌన్సిలర్లు తమ వాక్కులకు వ్యతిరేకంగా వ్యవరించడం సరైన పద్ధతి కాదన్నారు. భవిష్యత్తులో ఇలాంటి సమ్యలు తలెత్తకుండా ఉండేందుకు రాష్ట్రంలోని అన్ని మున్సిపాల్టీల చైర్ పర్సన్లు, మేయర్లు అధికారులు కాలరాసే హక్కులను సాధించేందుకు ఉద్యమించాలని ఈ సందర్భంగా ఆమె పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యంలో అధికారులు కొందరితో కుమ్మకై హక్కులను కాలరాసే ఎందుకు ప్రయత్నిస్తే ఊరుకునేది లేదని ఈ సందర్భంగా హెచ్చరించారు. అధికారులు ప్రతిపక్ష కౌన్సిలర్ ఎజెండా అంశాలను ఆమోదం చేయడం జరిగిందని తెలిపారు. చైర్ పర్సన్ సంతకం లేని ఎజెండా చట్ట విరుద్ధమని అన్నారు. మరోవైపు అజెండాలోని ప్రవేశపెట్టిన అభివద్ధి పనులకు తాము ఏమాత్రం అడ్డంకి కాదని వివరించారు . మరికొందరు కౌన్సిలర్లు ఎజెండా అంశాలలో మున్సిపల్ నిధులు దుర్వినియోగం అవుతున్నట్లుగా పేర్కొన్నారు. గత చరిత్రలలో ఇప్పటివరకు చైర్పర్సన్ సంతకం లేనిది ఎజెండానే ఉండేది కాదని అన్నారు. కోర్టులో న్యాయమే గెలుస్తుందని తెలియజేశారు. అతి త్వరలో మళ్లీ కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. అవినీతికరమైన నిధుల దుర్వినియోగం కోసం ఏర్పాటు చేసుకున్న జెండాలను తొలగించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ కౌన్సిలర్ శోభారాణి మాజీ వైస్ చైర్ పర్సన్, ప్రస్తుత కౌన్సిలర్ రత్నమాల, కౌన్సిలర్లు ప్రవీణ్ గౌడ్, బోయ రవి రాజా, వెంకన్న గౌడ్ ,రాము, కో ఆప్షన్ సభ్యులు కవి, టిఆర్ఎస్ నాయకులు బాల్ రెడ్డి, పట్లోళ్ల నరసింహులు టిఆర్ఎస్ పార్టీ నాయకులు దావులయ్య ,అశోక్, రమేష్ ,నరేష్, శేఖర్, ఖరీఫ్ తదితరులు పాల్గొన్నారు.