Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మహనీయుల బాటలో పయనిద్దాం
మహనీయుల త్యాగాలను స్మరించుకోవాలి
నవతెలంగాణ-వికారాబాద్ కలెక్టరేట్
73వ గణతంత్ర దినోత్సవం వేడుకలు బంగి ఇంటర్నేషనల్ పాఠశాలలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన డాక్టర్ చంద్ర ప్రియా జెండా ఆవిష్కరణ చేశారు ఈ సందర్భంగా డాక్టర్ చంద్ర మాట్లాడుతూ నేటి రోజు రాజ్యాంగం అమలులోకి వచ్చిన దినంగా అందరూ గుర్తించాలని దీనికి అంబేద్కర్ సహా చాలామంది మేధావులు ఎంతో శ్రమించారని ప్రపంచంలో ఉన్నటువంటి ఇ రాజ్యాంగాలను చదివి అర్థం చేసుకొని మన దేశానికి అనుగుణంగా మన సంస్కతికి తగ్గట్టుగా అన్ని కులాలకు మతాలకు సమానంగా రాజ్యాంగంలో హక్కులు పొందుపరచాలని ఆమె అన్నారు. దానిలో ముఖ్యమైంది విద్య వైద్యం అని అందరూ విద్యను అభ్యర్థించినప్పుడే దేశం అభివద్ధి చెందుతుందని ప్రతి ఒక్కరికి విద్య యొక్క ప్రాధాన్యత తెలియజేయాలని ఆమె గుర్తు చేశారు. కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ కుమారస్వామి ప్రిన్సిపాల్ ఎం రమాదేవి ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
బుధవారం నాడు గణతంత్ర వేడుకలను పురస్కరించుకొని ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థులు ఆన్లైన్లో తమ ప్రతిభను కనబర్చారు. మహనీయుల వేషధారణలతో అందర్నీ ఆకర్షించారు. విద్యార్థులు చేసిన ప్రతిభను మెచ్చుకొని స్కూల్ యాజమాన్యం వారిని అభినందించారు