Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఒప్పంద ప్రకారం కో-ఆప్షన్ ఇవ్వాలన్న ఎమ్మెల్యే
ఎమ్మెల్యే చెప్పిన పట్టించుకోని మండల నాయకులు
పార్టీ నష్ట పోతుందన్న టీఆర్ఎస్ నాయకులు
నవతెలంగాణ-పూడూర్
పూడూర్ మండల కో-ఆప్షన్ విషయంలో ఆరు నెలలుగా ఎమ్మెల్యే చెప్తున్నా మండల టీఆర్ఎస్ నాయకులు పట్టించుకోవడంలేదని టీఆర్ఎస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ కే.హరిశ్వర్ రెడ్డి, పూడూర్ ఉప సర్పంచ్ టి. రాజేందర్, నాయకులు వార్డు సభ్యులు జంగయ్య, ఎం శేఖర్ అన్నారు. బుధవారం పూడూర్ మండల కేంద్రంలో విలేకర్ల సమావేశం నిర్వహించి మాట్లాడారు. 2019లో జరిగిన జెడ్పిటిసి ఎంపీపీ ఎన్నికల్లో మండల కో ఆప్షన్ ఎన్నుకునే విషయంలో పూడూరు మండల కేంద్రానికి చెందిన ఎండి జెలిల్ పెద్ద ఉమెంతల్ గ్రామానికి చెందిన అయూబ్ మధ్య తీవ్ర పోటీ జరిగింది. మండల టీఆర్ఎస్ నాయకులు ఎంపీపీ జడ్పిటిసి ఎంపిటిసిల సమక్షంలో ఒక సంవత్సరం పెద్ద ఉమెంతల్ గ్రామానికి చెందిన ఎండీ అయూబ్‌కు పదవి ఇవ్వాలని పెద్దల సమక్షంలో ఒప్పంద పత్రాన్ని రాసి ఇవ్వడం జరిగింది. ఒప్పందం ప్రకారం అయూబ్ కు ఇచ్చిన పదవి కాలం పూర్తి అయిపోయింది. మండల కేంద్రానికి చెందిన జలీల్‌కు అనుకున్న ప్రకారం సంవత్సరం తర్వాత ఇస్తామన్న కో ఆప్షన్ పదవి ఇప్పటివరకు ఇవ్వలేదన్నారు. అనుకున్న ప్రకారం పదవి కాలం పూర్తయి రెండు సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటివరకు కో-ఆప్షన్ విషయంలో మండల నాయకులు ఎవరు కూడా స్పందించడం లేదన్నారు. ఈ విషయంపై మూడు నెలల క్రితం ఎమ్మెల్యే దష్టికి తీసుక పోగా మాట అనుకున్న ప్రకారం కో-ఆప్షన్ పదవి పూడూరు మండల కేంద్రానికి చెందిన జెలిల్కు ఇవ్వాలని మండల నాయకులకు చెప్పిన ఇప్పటివరకు కో-ఆప్షన్ పదవి విషయంలో ఈరోజు రేపు అంటూ కాలం వెళ్లదీస్తున్నారు తప్ప పదవి ఇప్పించడంలో మండల నాయకులు నిర్లక్ష్యం వహిస్తున్నారని అన్నారు. మన ఎమ్మెల్యే మహేష్‌రెడ్డి కో-ఆప్షన్ విషయంలో మండల నాయకులకు ఆదేశాలు జారీచేసిన పట్టించుకోవడం లేదన్నారు. ఈ విషయంలో పూడూరు మండల కేంద్రంలో టిఆర్ఎస్ పార్టీలో అందరూ నిరుత్సాహంతో ఉన్నారని ఆరు నెలలుగా టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలకు పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ దూరంగా ఉన్నారని తెలిపారు. ఇలా అయితే రాబోయే రోజుల్లో టీఆర్ఎస్ పార్టీకి నష్టం జరుగుతుందని ఇప్పటికైనా మండల నాయకులు ఎమ్మెల్యే మహేష్ రెడ్డి ఈ విషయంపై స్పందించి కోఆప్షన్ పూడూరు మండల కేంద్రానికి చెందిన జలీల్‌కు ఇచ్చే విధంగా చూడాలని కోరారు.