Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-షాబాద్
73వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా షాబాద్ మండలంలోని ప్రభుత్వ కార్యాలయాలు, ఆయా పార్టీల కార్యాలయాలు, కళాశాలలు, పాఠశాలలు, పోలీస్‌స్టేషన్, ఆస్పత్రులు, బ్యాంకులు, యువజన సంఘాల భవనాలపై మువ్వన్నెల జెండా బుధవారం రెపరెపలాడింది. మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంపై తహసీల్దార్ అమరలింగంగౌడ్, ఎంపిడివో కార్యాలయంలో ఎంపిడివో అనురాధ, పోలీస్‌స్టేషన్‌లో ఇన్స్పెక్టర్ ఆశోక్, సహకారసంఘం కార్యాలయంలో చైర్మెన్ చల్లా శేఖర్‌రెడ్డి, సర్ధార్‌నగర్ మార్కెట్‌యార్డులో పొన్న స్వప్ననర్సింహ్మారెడ్డి, పీఆర్ఆర్ స్టేడియంలో నక్క శ్రీనివాస్‌గౌడ్, వ్యవసాయ అధికారి కార్యాలయంలో ఏవో వెంకటేషం, వశువైద్యశాలలో డాక్టర్ స్రవంతి, షాబాద్ గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ సుబ్రమణ్యేశ్వరీ జాతీయ జెండాను ఎగురవేశారు. మండల పరిధిలోని ఆయా గ్రామపంచాయతీ కార్యాలయాల్లో సర్పంచులు, ప్రభుత్వ పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులు, అంగన్వాడీ కేంద్రాల్లో కార్యకర్తలు, యువజన సంఘాలల్లో సభ్యులు జాతీయ జెండాను ఎగురవేశారు.