Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వైశ్య ఫెడరేషణ్, వాసవిక్లబ్ ప్రతినిధులు
నవతెలంగాణ-తాండూరు
పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా వైశ్య ఫెడరేషన్ వాసవి క్లబ్ ఆధ్వర్యంలో బుధవారం తాండూరులోని ప్రభుత్వ జిల్లా ఆస్పత్రితో పాటు హైదరాబాద్ రోడ్డు మార్గంలోని మాతా శిశు ఆస్పత్రిలో అన్నదానం, పండ్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. అదేవిధంగా వైశ్య ఫెడరేషన్ వికారాబాద్ జిల్లా అధ్యక్షులు రొంపల్లి సంతోష్‌కుమార్ ఆస్పత్రిలో రోగులకు పండ్లు, బ్రేడ్లను పంపిణీ చేశారు. అనంతరం అన్నదానం చేశారు. కార్యక్రమంలో వైశ్య ఫెడరేషన్ ట్రెజరర్ అగీరు మహేష్, తాండూరు అధ్యక్షులు గౌరీశంకర్, వాసవి క్లబ్ అధ్యక్షులు వంశీ, కోశాధికారి శ్రీకాంత్ సభ్యులు ప్రమోద్, వీరేశం, ప్రవీణ్, జగన్, హరీష్ తదితరులు పాల్గొన్నారు.