Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-రంగారెడ్డిప్రాంతీయప్రతినిధి
ఎప్పుడు..ఎప్పుడా అని టీఆర్ఎస్ శ్రేణులు ఎదురుచూస్తున్న జిల్లా అధ్యక్ష ఎంపికను ఎట్టకేలకు పార్టీ అధ్యక్షులు సీఎం కేసీఆర్ బుధవారం టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుల జాబీతాను విడుదల చేశారు. ఈ జాబీతాను భవిష్యత్ రాజకీయాల దృష్ట్య క్యాడర్‌ను సమన్వయం పర్చడం. కింది స్థాయి క్యాడర్‌తో సంబంధాలు.. పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు కైవసం చేసుకోవలన్న ఉద్దేశ్యంతో ఆచితూచి అధిష్టానం జిల్లా అధ్యక్షుల ఎంపిక జరిగింది. జిల్లా నాయకత్వం నుంచి అధ్యక్షల జాబీతాను అధిష్టానానికి చేరిన దాదాపు ఆరు నెలల తరువాత జిల్లా అధ్యక్షుల ఎంపికను ప్రకటించడం జరిగింది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా ఎమ్మెల్యే మంచి రెడ్డి కిషన్ రెడ్డి, వికారాబాద్ జిల్లా అధ్యక్షుడిగా మెతుకు ఆనంద్‌లను నియమించడం జరిగింది.
ఎమ్మెల్యే మంచిరెడ్డి రాజకీయ ప్రస్థానం..
రాజకీయ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చినప్పటికీ.. రాజకీయంగా మాత్రం గ్రామ స్థాయి నుంచి రాజకీయ ఓనమాలు నేర్చుకుని.. రాష్ట్ర స్థాయి నాయకుని వరకు వివిధ క్యాడర్లో పనిచేశారు. 1982లో ఎన్టీ రామరావు నాయకత్వంలో ప్రత్యేక్ష రాజకీయాలోకి అడుగు పెట్టిన కిషన్ రెడ్డి మడమ తిప్పని రాజకీయం శక్తిగా ఎదిగారు. 1989లో సింగిల్ విండో చైర్మన్‌గా, జిల్లా డైరెక్టర్ పనిచేశారు. టీడీపీ జిల్లా అధ్యక్షులుగా మూడు దఫాలుగా బాధ్యతలు చేపట్టారు. అసెంబ్లీ ఎన్నికలు 2009, 2014, 2018 వరుగా ఇబ్రహీ ంపట్నం అసెంబ్లీ నిజయోజకవర్గం ఎమ్మెల్యేగా ఎన్నికైయ్యారు. ప్రస్తుతం ఆయనకు టీఆర్ఎస్ అధ్యక్షలు సీఎం కేసీఆర్ రంగారెడ్డి జిల్లా బాధ్యతలు అప్పగించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కిషన్ రెడ్డి మాట్లాడుతూ. రాబోయే అసెంబ్లీ ఎన్నికల వరకు జిల్లాలో పార్టీ బలోపేతం చేయడానికి శక్తి వంచన కృషి చేస్తానన్నారు. సీఎం కేసీఆర్ తమకు అప్పగించిన పార్టీ బాధ్యతలను నిబద్దతతో నిర్వర్తిస్తానన్నారు. జిల్లా పార్టీ బాధ్యతలు అప్పగించిన సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.