Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎంతోమంది త్యాగధనుల పోరాట ఫలితమే స్వాతంత్రం
వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విట్టల్ నాయక్
నవతెలంగాణ-తాండూరు
ఎంతోమంది త్యాగధనుల పోరాట ఫలితమే స్వాతంత్రం వచ్చిందని తాండూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విట్టల్ నాయక్ అన్నారు.పట్టణ కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో బుధవారం గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఎంతోమంది త్యాగధనుల ఫలితమే మనకు స్వాతంత్రం అని భారతదేశం 1950 జనవరి 26తో సంపూర్ణ స్వాతంత్య్రం లభించిందని దానినే మనం గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నామని అన్నారు. రాజ్యాంగ రచన కార్యాన్ని తన భుజస్కంధాలపై వేసుకొని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ దేశ ప్రజల సర్వతోముకాభివద్ధికి తోడ్పడే ఈ విధంగా లిఖిత రాజ్యాంగాన్ని అందించి అందులో హక్కులు, విధులు పొందుపరచడం జరిగిందని గుర్తు చేశారు. మార్కెట్ కమిటీ అభివద్ధికి తన వంతు కషి చేస్తానని 25 ఎకరాల స్థలంలో విశాలమైన మార్కెట్ ఏర్పాటు చేస్తామని అన్నారు. హమాలి కార్మికులకు కూడా ఇళ్ల స్థలాలు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి సహకారంతో అందజేస్తామని అన్నారు. రైతుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలతో రైతులను రాజును చేయడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ముందుకు వెళుతున్నారని అన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వెంకట్ రెడ్డి, ది గ్రీన్ అండ్ సీడ్ మర్చంట్ అసోసియేషన్ అధ్యక్షులు రామ్ రెడ్డి, సభ్యులు బంటారం సుధాకర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు కటకం వీరేందర్, దినేష్ సింగ్ ఠాకూర్, ఆశన్న, మల్లప్ప, సప్తగిరి, మార్కెట్ కమిటీ కార్యదర్శి రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.