Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సర్పంచ్‌గా కొనసాగింపునకు కలెక్టర్ ఆదేశాలు జారీ
చెక్ పవర్ సర్పంచ్ ఉప సర్పంచ్‌కు యధాతథం
హర్షం వ్యక్తం చేసిన సర్పంచ్
నవతెలంగాణ-శంషాబాద్
అక్రమ నిర్మాణాలు అరికట్టడంలో నిర్లక్ష్యం వహించారన్న ఆరో పణలతో సస్పెన్షన్‌కు గురైన మండల పరిధిలోని అల్లికోల్ తండా సర్పంచ్ కె .రేణుక ఈ నెల 25న మంగళవారం సాయంత్రం తిరిగి బాధ్యతలు స్వీక రించారు. దీనికి సంబంధించిన వివరాలను గ్రామ సర్పంచ్ బుధవారం మీడియాకు వివరించారు. తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల మేరకు సర్పంచ్ పదవిలో కొనసాగేందుకు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోరుకుమార్ ఈనెల 25న ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాల ప్రతు లను శంషాబాద్ ఇన్చార్జి ఎంపీడీవో బి. ప్రతిభ నిన్న సాయంత్రం సర్పంచ్ కె. రేణుకకు అందజేశారు. పదవితో పాటు సర్పంచ్ , ఉప సర్పంచ్ జాయింట్ చెక్ పవర్ అప్పగించాలని ఆదేశాలు జారీ చేశారు. తన పదవి తనకు దక్కడంతో సర్పంచ్ రేణుక హర్షం వ్యక్తం చేశారు. అనంతరం గ్రామంలో బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు.
సర్పంచ్ పలు అక్రమాలకు పాల్పడుతున్నారని అక్రమ నిర్మాణాలు అడ్డు కోవడంలో విఫలం చెందారని గత సంవత్సరం జులై 28న, జులై 31, ఆగస్ట్ 7న స్థానిక ప్రజల నుంచి మండల అధికారులకు ఫిర్యాదులు అందాయి. ఫిర్యా దును స్వీకరించిన డీఎల్పీవో పంచాయతీ సర్పంచ్ పై ఆరోపణలు దృవీకరిస్తూ రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు, డీపీవోకు విచారణ రిపోర్టును పంపించారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు సర్పంచ్ ఇచ్చిన వివరణతో సంతృప్తి చెందక షోకాజ్ నోటీసులు జారీ చేసి డిసెంబర్ 16 , 2021 ఆమెను సస్పెండ్ చేశారు. తర్వాత పంచాయతీ అధికారి అల్లికోల్ తండా పంచాయతీ కార్యాలయం వద్ద ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి, ఉపసర్పంచ్‌కి ఇన్చార్జి సర్పంచ్‌గా బాధ్యతలు అప్పగించారు. తమకు జరిగిన అన్యాయంపై గ్రామ సర్పంచ్ కె. రేణుక హైకోర్టును ఆశ్రయించి మధ్యంతర ఉత్తర్వులు తెచ్చుకున్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు మళ్లీ పదవీ బాధ్యతలు స్వీకరించారు .
73వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా బుధవారం గ్రామ పంచాయతీ వద్ద జాతీయ జెండా ఎగురవేశారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో సర్పంచ్ కె. రేణుకను జూకల్ ఎంపీటీసీ బుక్క ప్రవీణ్ కుమార్, పంచాయతీ కార్యదర్శి సుశీలబాయి, వార్డు సభ్యులు ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తనపై వచ్చిన ఆరోపణలను తప్పని నిరూపించుకుంటానని గ్రామ అభివృద్ధిపై దృష్టి సారించి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని హామీనిచ్చారు. తనకు మళ్లీ సర్పంచ్ పదవి రావడంలో కృషి చేసిన ఎంపీటీసీతో పాటు,వార్డు సభ్యులకు, గ్రామస్తులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ కె.రాజు, వార్డు సభ్యులు పద్మ, చాంది, వరలక్ష్మి, సంజు, మాను, రాంబాబు, శ్రీనివాస్, నాయకులు పాండు, గణేష్, పరమేష్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.