Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-శంకర్పల్లి
దేశభక్తుల త్యాగాలను నేటి యువత అలవర్చుకోవాలని శంకర్పల్లి సేవా ఫౌండేషన్ అధ్యక్షులు మహేష్ కుమార్ అన్నారు. బుధవారం గణతంత్ర దినోత్సవం పురస్కరించుకుని స్థానిక సేవా ఫౌండేషన్ అధ్యక్షుడు కార్యా లయంలో జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ ప్రతి భారతీయుడు భగత్‌సింగ్, సుభాష్ చంద్రబోస్, అల్లూరి సీతారామరాజులా దేశ సేవ చేయాలని సూచించారు. అనంతరం పిల్లలకు స్వీట్లు పండ్లు పంచిపెట్టారు.ఈ కార్యక్రమంలో మాజీ వార్డు సభ్యులు నాగ మణి, ఫౌండేషన్ సభ్యులు నరసింహాగౌడ్, వీనరేంద్రచారి, హరి, మధుమతి, విద్యార్థులు మౌనిక, దీపికా, ఋషి కుమార్, నాయకుల నాయకులు నరసింహారెడ్డి, బిర్లా సురేష్, కండక్టర్ నరేందర్ పూజారి కేదారి పాల్గొన్నారు.