Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-శంషాబాద్
శంషాబాద్ మండలంలో 73వ గణతంత్ర వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. శంషాబాద్ ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ విద్యాల జయమ్మ శ్రీనివాస్ జెండా ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ తన్విరాజు, వైస్ ఎంపీపి నీలం మోహన్, ఎంపీడీవో ప్రతిభ సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస ్రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షులు కే. చంద్ర రెడ్డి పాల్గొన్నారు.తహసీల్దార్ కార్యా లయం వద్ద తహసీల్దార్ జనార్ధన్‌రావు జెండా ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఆర్యు నరేష్ తదితరులు పాల్గొన్నారు. శంషాబాద్ డీసీపీ జోన్ కార్యాలయం వద్ద బీసీపీ డీసీపీ జగదీశ్వర్‌రెడ్డి, ఆర్జీఐఏ పోలీస్ స్టేషన్ సమీ పంలో ఏసీపీ భాస్కర్ వేముల, సీఐ విజరుకుమార్, ఆర్ఎస్ఐలు కృష్ణగౌడ్, దేవరాజ్ పాల్గొన్నారు. రూరల్ పోలీస్ స్టేషన్ వద్ద సర్కిల్ ఇన్స్పెక్టర్ జై.ప్రకాశ్‌రెడ్డి జెండా ఎగురవేశారు.మండలంలోని అన్ని గ్రామ పంచాయతీలు ప్రభుత్వ కార్యాలయాల్లో జెండా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. యువజన సంఘాలు, అంగన్వాడీ కేంద్రాలు పార్టీ జెండాల వద్ద వివిధ పార్టీల నేతలు గణతంత్ర దినోత్సవ వేడు కలు జరుపుకున్నారు.
చిన్నగోల్కొండ పీఎసీఎస్ వద్ద చైర్మన్ బొమ్మ దవనాకర్ గౌడ్ జాతీయ జెండా ఆవిష్కరించి, గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ గుర్రం రణధీర్ రణధీర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సుల్తాన్‌పల్లిలో :సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షులు దండు ఇస్తారి గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద జాతీయ జెండా ఎగురవేశారు. సర్పంచ్ స్పందన సుధాకర్, డైరెక్టర్ కాసుల బాలరాజ్‌గౌడ్, గ్రామ పార్టీ అధ్యక్షులు ఎల గని కుమార్‌గౌడ్,వార్డు సభ్యులు శ్రీశైలం,మౌనిక పాండు రంగారెడ్డి, వీరచారి, అరుంధ వీరేశం, సత్త్త్యమ్మ సమయ్య, కృష్ణ, గ్రామ కార్యదర్శి, పాల్గొన్నారు.
పిల్లోనిగూడలో గ్రామ సర్పంచ్ బుచ్చమ్మ జాతీయ జెండా ఎగురవేశారు. ఉప సర్పంచ్ కృష్ణ, పంచాయతీ కార్యదర్శి భాస్కర్,రాఘవ, కె.నర్సింహా, టీఆర్ఎస్ విలేజ్ ప్రెసిడెంట్ జుర్కి రమేశ్ పటేల్ తదితరులు పాల్గొన్నారు.