Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రోడ్డు భద్రతా నియమాలను పాటించాలి
ఎస్ఐ మధుసూదన్‌రెడ్డి
నవతెలంగాణ-తాండూరు రూరల్
సీసీ కెమెరాల ఏర్పాటుతోనే నేరాలు నియంత్రించవచ్చని కరణ్‌కోట ఎస్ఐ మధుసూదన్‌రెడ్డి అన్నారు. బుధవారం తాండూరు మండలం సిరిగిరిపేట గ్రామంలో అవగాహనా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా గ్రామంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నియమ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు.18 ఏండ్లలోపు యువతీ యువ కులు వాహనాలు నడపకూడదన్నారు. లైసెన్స్ లేనటువంటి వారికి ఎవరు కూడా వాహనాలను ఇవ్వకూడదన్నారు. పిల్లలు వాహనాలు నడిపి, అను కో కుండా ఏదైనా ఘటన జరిగితే తల్లిదండ్రులపైనా కేసు నమోదు చేయనున్నట్టు హెచ్చరించారు. అంతేకాకుండా గ్రామాల్లో బాల్య వివాహాలను అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, తదితరులు ఉన్నారు.