Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-శంకర్పల్లి
శంకర్పల్లి మండలంలో,మున్సిపల్ కార్యాల యంలో, ప్రభుత్వ ప్రయివేట్ కార్యాలయంలో 73వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా బుధ వారం జాతీయ జెండాను ఆవిష్కరించారు. శంక ర్పల్లి తహసీల్దార్ కార్యాలయం ఎదుట తహసీల్దార్ సైదులు, మండల ప్రజాపరిషత్ కార్యాలయం ఎందుట ఎంపీపీ గోవర్ధన్ రెడ్డితో కలసి ఎంపీడీవో వెంకయ్య, మున్సిపల్ కార్యాలయం ఎదుట చైర్పర్సన్ విజయలక్ష్మిప్రవీణ్ కుమార్‌తో కలసి కమిషనర్ యాదగిరి, శంకర్పల్లి పోలీస్ స్టేషన్లో సీఐ మహేశ్‌గౌడ్, ప్రభుత్వాస్పత్రి ఎదుట డాక్టర్లు, సహకార సంఘం సొసైటీ ఎదుట చైర్మన్ శశిధర్ రెడ్డితో కలిసి కార్యదర్శి రామ్‌రెడ్డి, మార్కెట్ కమిటీ కార్యదర్శి, వెలుగు కార్యాలయం ఎదుట ఏపీఎం భీమయ్య, ఉపాధి హామీ కార్యాలయం ఎదుట ఏపీవో నాగభూషణం, టీచర్స్ కార్యాలయం కాలనీలో ప్రెసిడెంట్ తొండ యాదయ్య, గోపు లారం పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ శ్రీని వాస్, మిర్జాగూడ గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట సర్పంచ్ రవీందర్ గౌడ్, మహారాజ్‌పేట్ గ్రామపంచాయతీ ఎదుట సర్పంచ్ నరసింహారెడ్డి, చందిప్ప పంచాయతీ ఎదుట సర్పంచ్ స్వప్నా మోహన్, పొద్దుటూరు పంచాయతీ నందు సర్పంచ్ నరసింహారెడ్డి, ఇంద్రారెడ్డినగర్ కాలనీలో వార్డు సభ్యులు వై ప్రవీణ్ కుమార్ జెండా ఆవిష్క రించారు. మండలంలోని వివిధ గ్రామాల్లో యువ జన సంఘాల కార్యాలయాల ఎదుట ఆయా అధ్యక్షులు కార్యదర్శులు జెండా ఆవిష్కరించారు. కౌన్సిలర్లు ఆయా వార్డులలో జెండాను ఎగరవేశారు. ఈ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో జడ్పీటీసీ గోవిందమ్మ గోపాల్ రెడ్డి, వైస్ ఎంపీపీ కురుమ రాములమ్మ ,ఎంపీటీసీలు యాదగిరి, కౌన్సిలర్లు వాణిప్రకాష్ ,చంద్రమౌళి , సంతోష్, శ్రీనాథ్ గౌడ్, సిహెచ్ అశోక్, తదితరులు ఉన్నారు.