Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాన-వికారాబాద్ రురల్
భారత రాజ్యాంగ స్ఫూÛర్తితోనే తెలంగాణలో పరిపాలన కొనసాగుతోందని వికారాబాద్ శాసనసభ్యులు డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. బుధవారం ఎమ్మెల్యే డాక్టర్ ఆనంద్ వికారాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ ఆవరణలో జాతీయ జెండా ఎగరవేసి, అనంతరం పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వికారాబాద్ మున్సిపల్ కార్యా లయ ఆవరణలో సంఘం లక్ష్మీభారు పాఠశాల విద్యార్థులకు, వికారాబాద్ మున్సిపల్ సిబ్బందికి ప్రశంస పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశంలో నూతనంగా అవతరించిన తెలంగాణ రాష్ట్రం రాజ్యాంగం అందించిన ఫెడరల్ స్ఫూర్తిని ప్రారంభం నుంచి ప్రదర్శిస్తోంద న్నారు. రాజకీయాలను, పరిపాలనను మిళితం చేయకుండా తెలంగాణ రాష్ట్రం నేరుపుతున్న రాజ్యాంగబద్ధమైన రాజనీతి నేడు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోందన్నారు. రాజ్యాంగ నిర్మాతలు అందించిన ఫెడరల్ స్ఫూర్తిని మరింత దృఢంగా కొనసాగించడానికి కంకణబద్ధులమై ఉందామని, అందుకు అచంచల విశ్వాసంతో ప్రతినబూనుదామన్నారు. వికారాబాద్ నియోజకవర్గ ప్రజలందరికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.