Authorization
Mon Jan 19, 2015 06:51 pm
క్రీడలతో మానసిక ఉల్లాసం
సీఐ మహేశ్‌గౌడ్
నవతెలంగాణ-శంకర్పల్లి
ప్రతి ఒక్కరూ ఉదయం వేళ గంట పాటు వ్యాయామం చేస్తే, శరీరంలో రక్తం పెరగడంతో పాటు, ఎంతో ఉల్లాసంగా ఉంటారని శంకర్పల్లి సీఐ మహేశ్‌గౌడ్ అన్నారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 24, 25 తేదీల్లో శంకర్పల్లి అరుణోదయ యూత్ వారు ఓపెన్ టు వాలిబాల్, బ్యాడ్మింటన్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ క్రీడలో పలు జట్లు పాల్గొనగా, గెలుపొందిన క్రీడాకారులకు సీఐ మహేశ్‌గౌడ్ బహుమతులు అందజేశారు. మొదటి బహుమతి మాణిక్యరెడ్డి, భాస్కర్‌రెడ్డి, రెండో బహుమతి సంజీవ్, రాజు గెలుపొందారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ క్రీడలతో ఉల్లా సంతో పాటు, శారీరక దృఢత్వం పెరుగుతోందన్నారు. విద్యాతో పాటు, క్రీడల పట్ల ఆసక్తి చూపాలని యువతకు సూచించారు. ఈ కార్యక్రమంలో అరుణో దయ యూత్ క్లబ్ అధ్యక్షులు సట్టాగళ్ళ శ్రీధర్‌గౌడ్, నాయకులు వై.ప్రకాశ్ గుప్తా, చిన్న,మోహన్ రెడ్డి,మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.