Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-శేరిలింగంపల్లి
కొండాపూర్ ఏరియా ఆస్పత్రిని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రంగారెడ్డి జిల్లా మెడికల్ అండ్ హెల్త్ వర్క్ షాప్ ఇన్‌ఛార్జి జ్ఞానేంద్ర ప్రసాద్ శుక్రవారం సందర్శించారు. అనంతరం మెడికల్ ఆఫీసర్, హాస్పిటల్ సిబ్బంది తో వ్యాక్సినేషన్ డ్రైవ్ గురించి, వ్యాక్సినేషన్‌పై హాస్పిటల్ సిబ్బంది ప్రజలకు ఎలాంటి అవగాహన కల్పిస్తున్నారని పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా హాస్పిటల్లో కరోనా చికిత్స పొందు తున్న వారిని కలసి ఆరోగ్య చికిత్సల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు మెడికల్, హెల్త్ వర్క్‌షాప్ సభ్యులు రఘునాథ్‌యాదవ్, ఆంజనేయులు, హరిప్రియ, మణిక్ రావు, బాబురెడ్డి, రామకృష్ణా, తదితరులు పాల్గొన్నారు.