Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-శంషాబాద్
వివాదాస్పదమవుతున్న శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని జోష్ కుంట శిఖం ఆక్రమణలపై అధికారులు శుక్రవారం చర్యలు తీసుకున్నారు. తహసీల్దార్ జనార్ధన్ రావు ఆదేశాల మేరకు రెవెన్యూ ఇన్స్‌స్పెక్టర్ సంజీవ జోష్ కుంట శిఖంలో స్థానిక మున్సిపల్ అధికారులతో కలిసి జేసీబీ, ట్రాక్టర్లతో మట్టి తొలగించారు. సర్వే నెంబర్ 325లో 7 ఎకరాల 29 గుం టల జోష్ కుంట శిఖం విస్తరించి ఉంది. ఈ కుంట ఆక్రమించి కొంతమం ది రియల్ ఎస్టేట్ వ్యాపారులు రాత్రికి రాత్రి మట్టి పోసి నింపారు. దీంతో స్థానికంగా కొంత మంది అభ్యంతరం తెలుపుతూ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీనికి స్పందించిన అధికారులు రెండు రోజులుగా మట్టిని తొలగించే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. చెరువులు కుంటలు ప్రభుత్వ భూములు ఆక్రమణలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని రెవెన్యూ అధికారులు తెలిపారు.