Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-శంషాబాద్
శంషాబాద్లో కోవిడ్ విజృంభన కొనసాగుతూనే ఉన్నది. మండల వైద్యాధికారులు డాక్టర్ నజ్మ, డాక్టర్ దివ్య, డాక్టర్ రమ్య తెలిపిన వివరాల ప్రకారం శంషాబాద్ లో 235 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 37 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. శంషాబాద్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో అత్యధికంగా 28 కేసులు నమోదయ్యాయి. పాజిటివ్ వచ్చిన అందరికీ హౌం ఐసొలేషన్ కిట్లు అందజేశారు. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని మధురానగర్లో కోవిడ్ నివారణ టీకా కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ శ్రవంతి శ్రీకాంత్ రెడ్డి, కో-ఆప్షన్ సభ్యులు కవితాప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.