Authorization
Mon Jan 19, 2015 06:51 pm
టీపీసీసీ ఎస్సీ సెల్ అధ్యక్షులు
జల్పల్లి నరేందర్, పి. సంజరు యాదవ్
తహసీల్దార్‌కు వినతి
నవతెలంగాణ- శంషాబాద్
చెరువుల సంరక్షణలపై టీఆర్ఎస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని టీపీసీసీ ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు జల్పల్లి నరేందర్ విమర్శించారు. శంషాబాద్ మున్సిపాలి టీ పరిధిలో చెరువులు కుంటలు నాలాలు కబ్జాలకు గురవుతున్నా టీఆర్ఎస్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నదని ఆరోపించారు. శంషాబాద్ మున్సిపా లిటీ పరిధిలోని రాల్లగూడ జోషీ కుంట చెరువు ఆక్రమణలపై శంషాబాద్ మున్సిపల్ కౌన్సిలర్ కాంగ్రెస్ మున్సిపల్ అధ్యక్షులు పిల్లనగ్రోవిల సంజరు యాదవ్‌తో కలిసి శుక్రవారం దోచుకుంటను పరిశీలించారు. అనంత రం తహసీల్దార్ జనార్దన్‌రావుకు జోషికుంట చెరువు ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని రాళ్ల గూడ గ్రామంలో అవుటర్ రింగ్ రోడ్డు పక్కన సర్వేనెంబర్ 325 లో 7.29 ఎకరాల విస్తీర్ణంలో దోషికుంట చెరువు ఉందని తెలిపారు. ఈ చెరువు అన్యాక్రాంతమై ప్రస్తుతం 5 ఎకరాలకు మించి లేదని తెలిపారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు కొన్ని రోజులుగా పట్టా భూమి పేరుతో రాత్రికి రాత్రి మట్టి తెచ్చి చెరువులో నింపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపరితలం నుంచి వరద ప్రవాహం కోసం నిర్మించిన కల్వర్టును సైతం పూడ్చి వేశారని అన్నారు. ఇంత జరుగుతున్నా రెవెన్యూ, ఇరిగేషన్, స్థానిక మున్సిపల్ అధికారులు సకాలంలో స్పందించలేదన్నారు. ప్రజలు అనేక సార్లు విజ్ఞప్తి చేస్తే తాత్కాలిక చర్యలు తీసుకున్నారని తెలిపారు. చెరువు ఆక్రమణలకు పాల్పడిన వారిపై వాల్టా చట్టం ప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేసి చట్టప రమైన చర్యలు తీసుకోవాలన్నారు. చెరువు అనుబంధంగా ఉన్న నాళాల ఆక్రమణలు తొలగించి అందుబాటులోకి తేవాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం మిషన్ కాకతీయ పేరుతో వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే టీఆర్ఎస్ నాయకులు మండలంలో చెరువులు కనుమరుగు చేసే పనికి పూనుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మిషన్ కాకతీయ కాదు కమీషన్ల కాకతీయ అని కాంగ్రెస్ ఆనాడే హెచ్చరించిందని గుర్తు చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి చెరువుల రక్షణపై చిత్తశుద్ధి లేదని ఆగ్రహం వ్యక్తం చేశా రు. మున్సిపాలిటీ పరిధిలో ఫిరంగినాలాతో పాటు చెరువులు, కుంటలు అన్యాక్రాంతం అవుతుంటే అధికార పార్టీ నాయకులు ఎందుకు పరిశీలించడం లేదని ప్రశ్నిం చారు. మిషన్ కాకతీయ లక్ష్యానికి టీఆర్ఎస్ నాయకులు తూట్లు పొడుస్తున్నారని, ఎక్కడ చెరువు ఉంటే అక్కడ టీఆర్ఎస్ నాయకుల వెంచర్లు వెలుస్తున్నాయన్నారు. ఇప్పటికైనా అధికారులు రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు లొంగకుండా వెంటనే జోషి కుంట చెరువు పూర్తిస్థాయిలో పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు బొబ్బిలి కృష్ణ పాల్గొన్నారు.