Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అభినందించిన సబితాఆనంద్ ఫౌండేషన్ చైర్మెన్ డాక్టర్ సబితాఆనంద్
నవతెలంగాణ -వికారాబాద్ రూరల్
వికారాబాద్ శాసనసభ్యుడు డాక్టర్ మెతుకు ఆనంద్, ముఖ్యమంత్రి కేసీఆర్‌ల చిత్ర పటాలు వేసి అభిమానాన్ని చాటుకున్నారు ఓ ఇద్దరు అన్నదమ్ములు. శుక్రవారం వారు వేసిన చిత్రపటాన్ని సబితాఆనంద్ ఫౌండేషన్ చైర్మెన్ డాక్టర్ సబిత నివాసంలో వారికి అందజేశారు. నారాయణఖేడ్‌కి చెందిన ఆగమప్ప, నాగరాజు ఇద్దరు మూగ, వినికిడి లోపం కల్గి ఉన్న వారు. సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్‌పై గల అభిమానంతో వారి చేతులతో చిత్రపటాన్ని గీశారు. వారు వేసిన చిత్రపటాన్ని అందుకున్న డాక్టర్ సబితాఆనంద్లు చిత్రకారులను అభినందించారు. ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్, సబితా ఆనంద్ ఫౌండేషన్ చైర్మెన్ డాక్టర్ సబితాఆనంద్ వారిని సన్మానించి, జ్ఞాపికను అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడు తూ మూగ, వినికిడి లోపం ఉన్న అన్నదమ్ములిద్దరూ గొప్ప ఆత్మ స్థైర్యం నింపుకొని వారి చేతి గీతలతో చిత్రాలు గీసి ఎంతో మంది అభిమానాన్ని పొందుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలోవారితో పాటు పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.