Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-శేరిలింగంపల్లి
కొండాపూర్ డివిజన్ పరిధిలోని గౌతమి ఎనక్లేవ్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యుల అభ్యర్ధన మేరకు శుక్రవారం ఉదయం కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్ అసోసియేషన్ సభ్యులు, కాలనీ వాసులు, జలమండలి అధికారులతో కలసి సమావేశామయ్యారు. ఈ సమావేశంలో గౌతమి ఎనక్లేవ్, చుట్టూ పక్కల నెలకొన్న తాగునీటి సమస్యల గురించి ప్రధానంగా చర్చించారు. తాగునీటి సరఫరా సమస్యలను కాలనీ ప్రజలు, సభ్యులు కార్పొరేటర్ హమీద్ పటేల్ దృష్టికి తీసుకొచ్చారు. జలమండలి అధికారులు మాట్లాడుతూ త్వరితగతిన సమస్యలను పరిష్కరిస్తామని, తాగునీటి సరఫరా సమయాన్ని పెంచటానికి ప్రయత్నిస్తామని తెలిపారు. అలాగే గౌతమి ఎనక్లేవ్లో ఉన్న స్పోర్ట్స్ గ్రౌండ్‌ను అభివృద్ధి చేసి, ఓపెన్ జిమ్, చిల్డ్రన్స్ ప్లే గ్రౌండ్ వంటి ఏర్పాటు చేస్తానని కార్పొరేటర్ గౌతమి వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులకు హామీ ఇచ్చారు. స్థానికంగా సమస్యలు ఏమైనా ఉంటే తన దృష్టికి తీసుకురావాలని అసోసియేషన్ సభ్యులకు కార్పొరేటర్ హమీద్ పటేల్ సూచించారు. ఈ సమావేశంలో వాటర్ బోర్డు డిప్యూటీ జనరల్ మేనేజర్ శ్రీమన్నారాయణ, మేనేజర్ సందీప్, గౌతమి ఎనక్లేవ్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ విఎన్ యస్ కృష్ణమోహన్‌రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ ఎమ్. ధర్మారెడ్డి, సెక్రటరీ వై. చైతన్య, జాయింట్ సెక్రటరీ బి. కిరణ్ కుమార్, సభ్యులు ఏ. శ్రీకాంత్, కె. శైలజ, కె. లక్ష్మి దేవి, దీపేష్ షా, ఈ. రామ్ మోహన్ రావు, బి.సుజిత్ తదితరులు పాల్గొన్నారు.