Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సమావేశాన్ని పట్టించుకోని అధికార, ప్రతిపక్ష ప్రజాప్రతినిధులు
కావాలనే సమావేశానికి
ప్రజాప్రతినిధుల డుమ్మా
జడ్పీ చైర్పర్సన్ అనితారెడ్డి వైఖరే కారణం
పరిస్థితి ఇలానే ఉంటే ప్రజా సమస్యల పరిష్కారం ఎలా అని పలువురి ఆందోళన
నవతెలంగాణ- రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
జిల్లా అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం, భవిష్య త్ కార్యచరణపై ప్రతీ మూడు నెలలకు ఒక్కసారి నిర్వ హించే కీలకమైన జడ్పీ సమావేశం రాజకీయాల ముసు గులో కనుమరుగు అవుతోంది. ప్రజాప్రతినిధులు, అధికారులను సమన్వయం చేసి సమావేశాన్ని నిర్వహించి, జిల్లా సమగ్రాభివృద్ధికి పాటుపడాల్సిన జడ్పీ చైర్పర్సన్ అనితారెడ్డి మెతక వైఖరి అవలంభించడం, తనకు నచ్చిన విధంగా వ్యవహరించడంతో ప్రజా సమస్యలు గాలికి పోతున్నాయి. స్థానిక సమస్యలను జడ్పీ సమావేశంలో ప్రస్తావించి, వాటిని పరిష్కారించుకోవాలనే ఉద్దేశంతో ఉన్న స్థానిక ప్రజాప్రతినిధులు జడ్పీ చైర్పర్సన్ మొండి వైఖరితో సమావేశానికి వెళ్లినా ప్రయోజనం ఉండదు అనే భావనతో సమావేశానికి రాలేని పరిస్థితి నెలకొంది. ఇందుకు నిదర్శనమే శుక్రవారం కోరం లేక వాయిదా పడిన జడ్పీ సమావేశం.
రంగారెడ్డి జిల్లా జడ్పీ సమావేశ మదిరంలో జడ్పీ చైర్ పర్సన్ అనితారెడ్డి అధ్యక్షతన జడ్పీ సర్వసభ్య సమావేశం శుక్రవారం జరగాల్సి ఉంది. అయితే ఈ సమావేశానికి జడ్పీ చైర్పర్సన్ అనితారెడ్డి, సీఈవో, ఇతర అధికారులు తప్పా జడ్పీటీసీలు, ఎంపీపీలు రాలేదు. కేవలం కం దుకూర్ జడ్పీటీసీ జంగారెడ్డి మాత్రమే వచ్చారు. ఇతర ప్రజాప్రతినిధులు వస్తే సమావేశం నిర్వహించాలని గంట న్నర పాటు వేచి చూశారు. అప్పటికీ ఎవ్వరూ రాకపోవడం తో అధికారులు నిరాశ చెందారు. చివరికి చేసేదేమీ లేక అధికారులు సమావేశం నుంచి వెళ్లిపోయారు. అనం తరం కోరం లేక జడ్పీ సర్వసభ్య సమావేశం వాయిదా వేస్తున్నట్టు జడ్పీ చైర్పర్సన్ అనితారెడ్డి ప్రకటిం చారు. అయితే జడ్పీ సమావేశానికి జడ్పీటీసీలు, ఎంపీపీలు రాకపోవడం పలు అనుమానాలకు తవిస్తోంది. జిల్లాలో అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులే అధికం గా ఉన్నారు. అయినప్పటికీ వారే సమావేశానికి రాలేదు. దీన్ని బట్టి పార్టీలో అంతర్గత విబేధాలు తేటతెల్లం అవుతున్నా యి. జడ్పీటీసీలు, ఎంపీపీలతో జడ్పీ చైర్పర్స న్కు మధ్య అంతరాయం తీవ్రంగా ఉందని స్పష్టం అవు తోంది. ఆమె వారి పట్ల వ్యవహరిస్తున్న తీరు.. నిధులు మంజూరు, ఇతర రాజకీయ కారణాలతోనే స్థానిక ప్రజాప్రతినిధులు సమావేశానికి డుమ్మా కొట్టినట్టు పలు వురు చర్చించుకుం టున్నారు. అయితే కావాలనే జడ్పీ చైర్పర్సన్ స్థానిక ప్రజాప్రతినిధులు అంటిముట్టనట్టు వ్యవహరిస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. సమావేశం నిర్వహిస్తే సమావే శంలో స్థానిక సమస్యలపై ప్రజాప్రతి నిధులు నిలదీస్తారనే భయంతోనే జడ్పీ చైర్పర్సన్ మొక్కుబడిగా సమావేశంపై సమాచారం ఇచ్చి, వాయిదా పడేలా చేసిందని టీఆర్ఎస్ శ్రేణులు చర్చించుకుంటున్నారు.