Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
సభ ఏర్పాట్ల పరిశీలన
నవతెలంగాణ-మహేశ్వరం
నేడు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పర్యటనను విజయవంతం చేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం తుక్కుగూడలో జరుగు తున్న ఏర్పాట్లను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తుక్కుగూడ మున్సిపాలిటీలో రూ.33 కోట్ల 50 లక్షలతో చేపట్టే పలు అభివృద్ధి పనులకు మంత్రి కేటీఆర్ శంఖుస్థాపన జరుగుతుందని ఆమె అన్నారు. మార్కెట్ యార్డులో జరుగుతున్న ఏర్పాట్లను మున్సిపాలిటీ, పోలీసు అధికారులతో మాట్లాడి పలు సూచనలను చేసారు. ప్రతి ఒక్కరూ సమన్వయంతో మంత్రి కేటీఆర్ పర్యటనను విజయవంతం చేయాలని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ జ్ఞానేశ్వర్ చైర్మెన్ మధుమోహన్, వైస్ చైర్మెన్ భవాని వెంకట్‌రెడ్డి, కౌన్సిలర్లు బాధావత్ రవినాయక్, బూడిద తేజస్విని శ్రీకాంత్‌గౌడ్, సప్పిడి లావణ్యరాజు, మున్సిపాలిటీ అద్యక్షులు జిల్లెల లక్ష్మయ్య యూత్ అద్యక్షులు కీసరి సామ్యూల్ రాజు, మహిళా అధ్యక్షురాలు పద్మాభాస్కర్రెడ్డి, రైతుబంధు మండల చైర్మెన్ రాఘవేందర్‌రెడ్డి, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ వర్కల యాదగిరిగౌడ్, ఎంఏ సమీర్, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.